ప్ర‌శాంత్ నీల్‌తో క‌న్ఫామ్‌.. 2030లో షూటింగ్

ram charan and prashant neel movie confirmed

Ram Charan: క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ సినిమా క‌న్ఫామ్ అయిపోయింది. డీవీవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్నారు. సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను ద‌సరా రోజు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది కానీ సినిమా షూటింగే 2029లో కానీ 2030లో కానీ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే ప్ర‌శాంత్ నీల్ చేతిలో కేజీఎఫ్ 3, ఎన్టీఆర్‌తో ఓ సినిమా, ప్ర‌భాస్‌తో స‌లార్ 2 ఉన్నాయి. ఇవ‌న్నీ అయ్యేస‌రికి 2030 వ‌చ్చేస్తుంది. ఇన్నేళ్లు ఆగాలంటే.. సినిమా కూడా అంత‌గా ఎదురుచూసే రేంజ్‌లో ఉండాలి. మ‌రి నీల్ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏంటో..!