Rajinikanth issue: చంద్రబాబుని పొగిడి తప్పు చేశారా?
vijayawada: ఏపీ(andhra pradesh)లో ఇటీవల జరిగిన ఎన్టీఆర్ శత జయంతి(ntr 100 years celebrations) సందర్బంగా సూపర్‌స్టార్ రజనీకాంత్(super star rajinikanth) చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. గత కొన్ని రోజులుగా ఇదే టాపిక్ హాట్‌హాట్‌గా నడుస్తోంది. శత జయంతి కార్యక్రమం సందర్బంగా రజనీకాంత్ చంద్రబాబు(tdp chief chadrababu)ను పొగడటం(praising) ,, గతంలో ఆయన చేసిన పాలనపై ప్రశంసలు కురిపించడంతో రజనీ వైసీపీ(ycp)కి టార్గెట్ అయ్యారు. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు వరుసబెట్టి రజనీకాంత్‌పై విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్(ntr)ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును రజనీ పొగడటం ఏంటని? ఏకంగా ఎన్టీఆర్ చావులో తలైవా పాత్ర కూడా ఉందని వైసీపీ సోషల్‌మీడియాలో ఆరోపణలు రావడం గమనార్హం. ఇక ఈ అంశంపై టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ స్పందించారు. రజనీకి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రజనీకాంత్ సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా, పరిపాలనపై ఎలాంటి విమర్శలు చేయలేదు కదా.. అలాంటప్పుడు తలైవాను ఇలా దిగజార్చి మాట్లాడటం సరికాదని చంద్రబాబు, లోకేష్, ఇతర నాయకులు ఆరోపిస్తున్నారు.
అయితే.. ఈ విషయంలో మాత్రం వైసీపీ కొంత హర్టయినట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ శత జయంతికి వచ్చిన రజనీ.. ఎన్టీఆర్ గురించి, ఆయన సినిమాల గురించి మాట్లాడాలి కానీ.. రాజకీయాలపై మాట్లాడటం.. అందులోనూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తడం ప్లాన్ ప్రకారం జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను రజనీ చదివారని ఆరోపిస్తున్నారు. ఎన్నికలు మరో ఏడాది కాలంలో ఉండగా.. రజనీకాంత్ వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. అయితే గతంలో జస్టిస్ చంద్రు(justis chandru) కూడా జగన్ పాలనలను ప్రశంసించడం వివాదాలకు తావిచ్చింది. తాజాగా రజనీకాంత్ మాటలు వైసీపీ వారిని నొప్పించాయి. ఏపీలో ఏ నాయకుడికి మద్దతు ఇచ్చి మాట్లాడినా.. ఇలాంటి వ్యక్తిగత, రాజకీయ విమర్శలకు వారు సిద్దపడి ఉండాలని తాజా పరిస్థితులు సూచిస్తున్నాయి.