rain alert: తెలుగు రాష్ట్రాలకు మోచా ముప్పు.. ఈ ప్రాంతాల్లో ప్రభావం!

hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం వలన.. మంగళవారం సాయంత్రం నుంచి రెండు రోజుల పాటు.. తెలంగాణ(Telangana) రాజధాని హైదరాబాద్ తో సహా.. పలు జిల్లాల్లో.. అదేవిధంగా కోస్తాంధ్ర(costha andhra), రాయలసీమలోని(rayalasema) అనేక ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. తుపాను ప్రభావం రెండు రోజులు మాత్రమే.. అనగా.. మే 11 వరకే ఉంటుందని ఐంఎడీ(imd) తెలిపింది. మే 12 తర్వాత ఎండల తీవ్రత ఉంటుందని చెబుతోంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మోచా.. తన దిశను మార్చుకోవడం వల్ల తెలుగు రాష్ట్రాలపై పెద్దగా ప్రభావం చూపదని వాతావరణశాఖ నిపుణులు అంటున్నారు. దీంతో మయన్మార్‌, బంగ్లాదేశ్ మీదుగా.. అల్పపీడనం వెళ్తుందని అంటున్నారు. మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాలపై వున్న తేమను ఈ తుపాను తీసుకుపోవడంతో.. ధార్ ఎడారి మీదుగా వీచే పొడి గాలుల వల్ల.. తెలుగు రాష్ట్రాలలోపై ప్రభావం ఉంటుందని.. మే 12 నుంచి మే నెలాఖరు వరకూ ఎండలు మండిపోతాయని పేర్కొన్నారు. వడగాల్ఫులు తోపాటు.. 48℃ నుంచి 50℃ వనరే ఎండ తీవ్రత ఉంటుందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది.

హైదరాబాద్‌లో భారీ వర్షం..
హైదరాబాద్‌తోపాటు, తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ప్రధానంగా హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వాన కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత రెండు మూడు రోజులుగా ఎండల దాటికి అవస్థలు పడుతున్న నగర ప్రజానికానికి ఈ వానలు కాస్త ఉపశమనం కలిగించినట్లైంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్న పరిస్థితి.