Train Accident: డ్రైవర్‌దే తప్పిదం.. వెల్లడించిన అధికారులు
Vizianagaram Train Accident: విజయనగరంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న రైలు ప్రమాదం డ్రైవర్ తప్పిదమేనని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న రైలు డ్రైవర్ రెడ్ సిగ్నల్ వేసినా కూడా పట్టించుకోకుండా వెళ్లడం వల్లే ఈ ఘోరం చోటుచేసుకుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. సిగ్నల్ జంప్ అవ్వడంవల్లే విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న రైలు పలాస రైలును ఢీకొందని.. ఆ తర్వాత రైలు బోగీలు పక్క పట్టాలపై వెళ్తున్న గూడ్స్ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కూడా మృతిచెందాడని తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా ఇప్పటివరకు 18 రైళ్లు రద్దు అవగా.. మరో 22 రైళ్లను దారి మళ్లించారు. సహాయక చర్యలు ఈరోజు సాయంత్రానికి పూర్తవుతాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ ఉన్న భారత్‌లో ఇప్పటివరకు చాలా ఘోర రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. . జూన్‌లో జరిగిన ఒడిశాలోని బాలసోర్ రైలు ప్రమాద ఘటన తర్వాత అంతటి స్థాయిలో జరిగిన ప్రమాదం ఇదే. (ap train accident)