R Sai Kishore: దేశంలోనే బెస్ట్ స్పిన్న‌ర్ల‌లో ఒక‌డిని.. జ‌డేజా ప్లేస్‌లో న‌న్ను తీస్కోండి

R Sai Kishore is ready for international cricket after recovering from an injury.

R Sai Kishore: అంత‌ర్జాతీయ క్రికెట్‌లో త‌న స‌త్తా నిరూపించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నాడ‌ని అంటున్నాడు ఆర్ సాయి కిశోర్. ఈ 27 ఏళ్ల క్రికెట‌ర్ ఏషియ‌న్ గేమ్స్‌లో భార‌త్‌కు గోల్డ్ మెడ‌ల్ తెచ్చిపెట్టాడు. రంజీ ట్రోఫీలో ఆడి సెమీ ఫైన‌ల్ వ‌రకు వెళ్ల‌గ‌లిగాడు. రంజీ ట్రోఫీలో త‌మిళ‌నాడులో ముంబై చేతిలో ఓడిపోయినప్ప‌టికీ టాప్ బౌల‌ర్ల‌లో ఒక‌డిగా నిలిచాడు. 9 మ్యాచ్‌లో 53 వికెట్లు తీసి త‌న స‌త్తా నిరూపించుకుంటున్నాడు.

అయితే.. సెప్టెంబ‌ర్ 19 నుంచి జ‌ర‌గ‌నున్న బంగ్లాదేశ్ సిరీస్‌లో త‌న‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని సెలెక్ట‌ర్ల‌ను కోరుతున్నాడు సాయి కిశోర్‌. తాను దేశంలోనే బెస్ట్ స్పిన్న‌ర్ల‌లో ఒక‌డిన‌ని.. ఒక‌వేళ ర‌వీంద్ర జ‌డేజాకు గాయం కార‌ణంగా రెస్ట్ ఇస్తే అత‌ని స్థానంలో త‌న‌ను తీసుకోవాల‌ని కోరుతున్నాడు. బంగ్లాదేశ్ సిరీస్ కోస‌మ‌ని ర‌వీంద్ర జ‌డేజా, ర‌విచంద్ర‌న్ అశ్విన్, కుల్దీప్ యాద‌వ్‌ల‌ను స్పిన్న‌ర్లుగా నియ‌మించారు. అయితే జ‌డేజాకు గాయాలు త‌ర‌చూ అవుతున్న నేప‌థ్యంలో ఒక‌వేళ ఆయ‌న‌కు రెస్ట్ ఇస్తే అత‌ని స్థానంలో త‌న‌ను తీసుకుంటే బాగుంటుంద‌ని కిశోర్ ఆశ‌ప‌డుతున్నాడు.