నేనేమ‌న్నా సీరియ‌ల్ కిల్ల‌ర్‌నా?

r ashwin says am i a serial killer

R Ashwin: బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ పోరులో విజ‌యం భార‌త్‌నే వ‌రించింది. ఈ టెస్ట్ సిరీస్‌లో హైలైట్‌గా నిలిచింది ర‌విచంద్ర‌న్ అశ్వినే. అందుకే అత‌ని పెర్ఫామెన్స్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును ప్ర‌క‌టించారు.. ఈ అవార్డు అనంతరం అశ్విన్ మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కు మీ కెరీర్‌లో వ‌చ్చిన అవార్డుల‌ను లెక్క పెట్టుకుంటూ ఉంటారా అని ఓ జర్న‌లిస్ట్ ఈ సంద‌ర్భంగా అశ్విన్‌ను అడిగారు.

దీనిపై అశ్విన్ స్పందిస్తూ.. “” నేనేమ‌న్నా సీరియ‌ల్ కిల్ల‌ర్‌నా ఇవ‌న్నీ లెక్క‌పెట్టుకుంటూ ఉండ‌టానికి. అయినా నాకు ఇప్పుడు అవార్డులు ఆ కిక్‌ని ఇవ్వ‌వు. నాకు ఆట‌లోనే సంతోషం ఉంది. ఆట త‌ర్వాత వ‌చ్చే గెలుపు, ఓట‌ముల్లో కాదు “” అని తెలిపారు. అశ్విన్ స‌మాధానానికి అంతా ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు.

బంగ్లాదేశ్ సిరీస్ మొత్తంలో అశ్విన్ 11 వికెట్లు తీసారు. చెన్నైలో జ‌రిగిన మ్యాచ్‌లో అయితే అశ్విన్ సెంచ‌రీ బాది ఇండియాను రిస్క్ నుంచి బ‌య‌ట‌ప‌డేసారు. కాన్పూర్ టెస్ట్‌లో రెండన్న‌ర‌ రోజులు మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం అయిపోయింది. ఆ త‌ర్వాత నాలుగో రోజు చివ‌రి గంట‌లో అశ్విన్ రెండు కీల‌క వికెట్ల‌ను అశ్విన్ తీసారు. ఇక సిరీస్ చివ‌రి రోజు టీమిండియాకు థ్రెట్‌గా మారిన‌ మోమిన్ ఉల్ హ‌క్ వికెట్ తీసి తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచ‌రీ వైపు న‌డిపించారు. ఇప్పుడు అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు క‌లిగున్న ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌ణ్‌కు స‌మానంగా అశ్విన్ రికార్డులు ఉన్నాయి.