యువ సంఘర్షణ సభకు హాజరుకానున్న ప్రియాంకా గాంధీ!
Hyderabad: రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) నాయకురాలు ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi vadra) దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో భాగంగా ప్రియాంక మే 8న హైదరాబాద్లో పర్యటించనున్నారు. సోమవారం సాయంత్రం 3:30 గంటలకు శంషాబాద్(Shamshabad) విమానాశ్రయానికి ప్రియాంక చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియానికి చేరుకుంటారు. ఆపై నేరుగా యువ సంఘర్షణ వేదిక మీదకు వెళతారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉండి చనిపోయిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఇన్స్యూరెన్స్ చెక్కులను అందజేస్తామని ప్రియాంకా గాంధీ తెలిపారు. 4:30 గంటలకు ప్రియాంక గాంధీ ప్రసంగం ఉండనుంది. ప్రియాంక గాంధీ ఈ వేదికపై యూత్ డిక్లరేషన్ ప్రకటించనున్నారని సమాచారం. సాయంత్రం5 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి 6:15 గంటలకు ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.
ప్రియాంక గాంధీ హాజరయ్యే సభకు యువకులు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. యువతకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ధాన్యం ఇంకా కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. తడిసిన ధాన్యం కొంటామని సీఎం చెబుతుంటే.. తడిసిన ధాన్యం కొనమని మంత్రి చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.