మ‌హేశ్ బీస్ట్ లుక్..​..ఫ్యాన్స్‌కి పూన‌కాలే

టాలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుకు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఫ్యాన్​పాలోయింగ్​ ఉన్న హీరోల్లో మహేష్​ పేరు ముందుంటుంది. అందులోనూ అమ్మాయిల ఫాలోయింగ్​ మరీ ఎక్కువ ఈ హ్యాండ్​సమ్​ హీరోకి. మహేష్ బాబు హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వయసును ఏమాత్రం పైకి కనిపించకుండా మెయింటైన్ చేస్తున్నాడు. ఒక విధంగా వయసు మళ్ళీ తగ్గుతుంది అనేలా కూడా అతను కనిపిస్తూ ఉండడం విశేషం. మహేష్ బాబుకు 5 పదుల వయసు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇంకా పాతికేళ్ల కుర్రాడి తరహాలో కనిపిస్తూ ఉండడం విశేషం. అయితే ఇప్పుడు మహేష్ బాబు లుక్ చూస్తుంటే సినిమాలో యాక్షన్స్ సీన్స్ కు తగ్గట్టుగా తన ఫిట్నెస్ ను కూడా మార్చుకున్నట్లుగా అర్థమవుతుంది ఇన్ని రోజులు పెద్దగా తన బాడీని చూపించని సూపర్ స్టార్ ఇప్పుడు మాత్రం జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అందులో మహేష్ బాబు కండలు తిరిగిన బాడీతో సరికొత్తగా కనిపిస్తున్నాడు.

సినిమా కథ ఏదైనా కూడా సరే మహేష్ బాబు హెయిర్ స్టైల్ ను మారుస్తూ మేనేజ్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా మహేష్ బాబును ఎన్నిసార్లు వెండితెరపై చూసినా కూడా కొత్తగానే కనిపిస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ మాత్రమే కాకుండా యాక్షన్ ఎలివేషన్స్ కూడా గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా షాక్ ఇచ్చేలా ఫైట్ సీన్స్ ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇస్తాయని కూడా తెలుస్తోంది. మొదట కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ తోనే షూటింగ్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం SSMB 28 షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేశ్‌ తాజాగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేశాడు. తన ఫిటినెస్‌ ఫొటో షేర్‌ చేసి ఫ్యాన్స్‌కి ట్రీట్‌ ఇచ్చాడు. మహేశ్‌ ఇప్పటి వరకు కామ్‌ అండ్‌ కూల్‌ చిత్రాలే చేశాడు. తెరపై ఆయన సిక్స్‌ ప్యాక్‌తో కనిపించింది లేదు. ఇక వెండితెరపై అందరి హీరోల్లా ఆయన బాడీ షో చేసిన దాఖలాలు లేవు. కానీ ఆయన తాజా పోస్ట్‌ చూస్తుంటే ఇప్పుడు మహేశ్‌ ఆ రూల్‌ బ్రేక్‌ చేయబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మహేశ్‌ బీస్ట్‌ లుక్‌కి ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. దీంతో తన తదుపరి చిత్రాలపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. త్రివిక్రమ్‌, జక్కన్నయాక్షన్‌ అడ్వెంచర్‌ చిత్రాల కోసమే మహేశ్‌ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడా? అని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలతో మహేశ్‌ తన బీస్ట్‌ లుక్‌తో ట్రీట్‌ ఇవ్వబోతున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా కూడా అడ్వెంచర్ యాక్షన్ మూవీగా రాబోతోంది. అయితే రాజమౌళి ప్రతి సినిమాలో కూడా హీరోలను దాదాపుగా కండలు పెరిగిన బాడీ తోనే చూపిస్తూ ఉంటాడు. కాబట్టి మహేష్ ముందస్తుగానే కండలు పెంచే పనిలో పడ్డాడు అనుకుంటున్నారు అభిమానులు. మహేష్​ బీస్ట్​ లుక్​ ఏ సినిమాకోసమో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే!