‘నాటు నాటు’ పాటకి స్టెప్పులేసిన‌ ప్రభుదేవ

దర్శకధీరుడు ఎస్​ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాట విడుదలైనప్పటినుంచీ సోషల్​ మీడియాలో దీనిపై మిలియన్లలో రీల్స్​ వచ్చిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు కూడా ఈ పాటకి కాలు కదిపారు. అయితే ఇటీవలే బెస్ట్ ఒరిజినల్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ కైవసం చేసుకుంది ఈ పాట. కేవలం ఆస్కార్ మాత్రమే కాదు.. అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ ఈ పాటను వరించాయి. దీంతో మరోసారి ఈ పాటకు కాలు కదుపుతున్నారు నెటిజన్స్. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇండియన్ మైఖేల్ జాక్సన్.. స్టార్ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ ప్రభుదేవా ట్రిపుల్ ఆర్ చిత్రయూనిట్ కు తన శుభాకాంక్షలు తెలిపారు. తన టీంతో కలిసి నాటు నాటు పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రెడ్ హార్ట్ సింబల్స్​తో శుభాకాంక్షలు తెలిపారు.
ఇండియన్​ మైఖేల్​ జాక్సన్​ ప్రభుదేవా డాన్స్​కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రతి పాటలోనూ సరికొత్త స్టెప్పులతో ఒరిజినల్​ సాంగ్ విజువల్ చేంజ్ చేస్తుంటారు. ఆయన డాన్స్​కు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ప్రభుదేవా.. ఇప్పుడు నాటు నాటు పాటకు స్టెప్పులేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక డ్యాన్స్​ అనంతరం రామ్​ చరణ్​, కొరియోగ్రాఫర్​ ప్రేమ్​ రక్షిత్​తో కలిసి కేక్​ కట్ చేసి సెలబ్రేట్​ చేసుకున్నారు. కాగా, శంకర్​, రామ్​చరణ్​ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ప్రభుదేవా ఒక పాటకి కొరియోగ్రాఫ్​ చేస్తున్నారని ఆ లొకేషన్​లోనే ఇలా ఆర్​ఆర్​ఆర్​ టీమ్​కి శుభాకాంక్షలు తెలిపినట్టు టాక్​.​
ప్రపంచవ్యాప్తంగా ఇంకా ‘నాటు నాటు’ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికీ పలువురు సెలబ్రిటీలు మరి ముఖ్యంగా క్రికెటర్స్ ఈ పాటకు కాలు కదిపి తమ ఇష్టాన్ని తెలియజేశారు. 95వ అకాడమీ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో ‘నాటు నాటు’ ఆస్కార్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. చరిత్రలో నిలిచిపోయే ఘనత సాధించిన కీరవాణి, చంద్రబోస్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ తదితరులకు విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు, సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలియజేస్తున్నారు. తాజాగా స్టార్ కొరియోగ్రాఫర్​, డైరెక్టర్ ప్రభుదేవా ఆర్​ఆర్​ఆర్​ బృందానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. తన టీమ్‌తో కలిసి ‘నాటు నాటు’ పాటకు సింపుల్ అండ్ కూల్‌గా తన స్టైల్లో స్టెప్పులేసిన ప్రభుదేవా తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియో షేర్ చేయగా వైరల్ అవుతోంది.. ‘మీరు సూపర్ మాస్టర్.. ఆర్​ఆర్​ఆర్​ టీమ్‌కిది బెస్ట్ ట్రిబ్యూట్’ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.