జులైలో పవర్​స్టార్​ సినిమా​!

సముద్రఖని దర్శకత్వంలో మెగా హీరోస్ పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. మాస్​ అండ్​ యాక్షన్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్ గా తమిళంలో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకున్న ‘వినోదయ సిత్తం’ కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై వివేక్ కూచిభొట్ల, టిజి విశ్వప్రసాద్ ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ ప్రతిష్టాత్మక మూవీని జులై 28న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించేశారు మేకర్స్. కాగా ఈ మూవీకి సంబందించిన అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో వరస హిట్లు అందుకున్న పవర్ స్టార్, ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న పిరాడిక్ డ్రామా హరిహర వీరమల్లు షూటింగ్​లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటున్నాడు పవన్​. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా పూర్తవకుండానే పవర్ స్టార్ మాత్రం వరుస సినిమాలకు సైన్ చేస్తునే ఉన్నాడు. తాజాగా సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతం’ రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఇందులో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఇటీవలె హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ ‘ఓజి’ సినిమాలు లాంచనంగా మొదలు పెట్టారు పవన్. అయితే ఎప్పుడో కొబ్బరికాయ కొట్టిన వినోదయ సీతమ్‌ రీమేక్​ ఇప్పుడు సెట్స్ పైకి వెళితే ఉస్తాద్ భగత్‌సింగ్, సాహో సినిమా దర్శకుడు సుజిత్ రూపొందించనున్న ఓజి పరిస్థితేంటనే టాక్ నడుస్తోంది. కానీ త్వరలోనే హరీష్ శంకర్ ప్రాజెక్ట్‌ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడట.
తాజాగా షూటింగ్ షెడ్యూలు ప్లానింగ్ పనులు స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉన్నహరీష్ శంకర్ హీరోయిన్‌గా పూజా హెగ్డేను కూడా ఫైనల్‌ చేసినట్టు టాక్. వినోదయా సీతంలో పవన్​ షెడ్యూల్​ పూర్తవగానే ఉస్తాద్ భగత్‌సింగ్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత సుజీత్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ మొదలు పెడతారని టాక్​. వీటితో పాటు హరిహర వీరమల్లు బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోను వచ్చే ఎన్నికల్లోపు ఈ సినిమాలను కంప్లీట్ చేయడమే పవన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ ఏడాది వరుస సినిమాలతో పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పొచ్చు.