Telangana Elections: సీఎం పదవి బరిలో ఉన్నది వీరే..!
తెలంగాణ ఎన్నికలు (telangana elections) దగ్గరపడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో (congress) సీఎం పదవిల లొల్లి ఎక్కువైంది. ఇంకా ఎన్నికలు జరగలేదు.. ఇంకా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు.. అప్పుడే నేను సీఎం అవతా అంటే నేనవుతా అంటూ రచ్చకెక్కుతున్నారు. 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్ధులు ఉన్నారు కానీ సీఎం పదవికి మాత్రం అభ్యర్ధి లేరు. అందుకే.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR.. మాకు సీఎంగా KCR ఉన్నారు మరి మీకు ఎవరున్నారు అని ఓసారి దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అభ్యర్ధుల అభిప్రాయం ప్రకారం.. తెలంగాణ ఎన్నికల్లో BRS, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం (hung) ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ తరఫు సీఎంగా ఎవరు ఉంటారు అనేదానిపై పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది కాంగ్రెస్ అభ్యర్ధులు సీఎం పదవిని ఆశిస్తున్నారు. (telangana elections)
పోటీలో ఎనిమిది మంది
సీఎం పదవి పోటీలో కాంగ్రెస్ నుంచి ఏడుగురు అభ్యర్ధులు ఉన్నారు. వారిలో జానా రెడ్డి, CLP నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, రేవంత్ రెడ్డి, జగ్గా రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఉన్నారు. వీరిలో జానా రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గా రెడ్డిలు ఎవరికి వారు మీడియా ముందుకు వచ్చి నేను సీఎం అవ్వాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పుకుంటున్నారు.
మిగతా వారు నేరుగా ఆ మాట అనలేక హైకమాండ్ దృష్టి తమపై పడేలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. జానా రెడ్డి (jana reddy) అయితే.. “” నేను సీఎం పదవిని ఆశించడంలేదు.. సీఎం పదవే నన్ను కోరుకుంటోంది. పీవీ నరసింహారావు అనుకోకుండా ప్రధాని అయినట్లు నేను కూడా సీఎం అవుతానేమో. ఒకవేళ అదే జరిగితే నా కుమారుడు రాజీనామా చేస్తాడు. నేను సీఎం పదవిని తీసుకుంటాను. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఏమీ చెప్పలేరు కదా “” అని కాస్త ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. (telangana elections)
ఇక రేవంత్ రెడ్డి (revanth reddy) అయితే తాను సీఎం అయితే వికలాంగ మహిళలకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తాను అని ప్రచారం చేస్తున్నారు. ఇక కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా సీఎం పదవిని ఆశిస్తున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జిగిరీ దోస్తులు. ఇప్పుడు సీఎం పదవి వీరి మధ్య చిచ్చుపెట్టే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్ధిగా రేవంత్ ఒక్కడే కాదు చాలా మంది సిద్ధంగా ఉన్నారు అని ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి వెంకట్‌రెడ్డి కామెంట్ చేసారు.
ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రాజనరసింహ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నారు. కాబట్టి వీరు డైరెక్ట్‌గా తమకు సీఎం పదవి కావాలని అడిగి తమ స్థాయిని తగ్గించుకోవాలని అనుకోవడంలేదు. ఏదున్నా హైకమాండ్‌తో మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది.