Poonam Kaur: YSR ఉండుంటే బాగుండు
Hyderabad: దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ysr), జయలలితలు (jayalalitha) బతికుంటే బాగుండు అని అంటున్నారు నటి పూనమ్ కౌర్ (poonam kaur). మణిపూర్ ఘటన గురించి ప్రస్తావిస్తూ ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇప్పుడున్న రాజకీయాల్లో క్లియర్‌గా కనిపిస్తున్న పొలిటికల్ లాభాల కంటే వారెంతో కష్టపడి పనిచేసారని పూనమ్ అన్నారు. వారిద్దరూ ఇప్పుడు బతికి ఉండుంటే రాష్ట్రాలు బాగుండేవని అన్నారు. పార్లమెంట్‌లో ఉన్న ఇండిపెండెంట్ లీడర్లను మణిపూర్ (manipur violence) మహిళల ఘటన అర్థంకాకపోతే.. ఇంకేదీ అర్థంకాదు అని మండిపడ్డారు. ఇంతకీ పూనమ్ ఇలా ఎందుకు ట్వీట్ చేసారంటే.. మణిపూర్ గురించి మూడు నెలలుగా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని (no confidence motion) ప్రవేశపెట్టాయి. ఈ అవిశ్వాస పరీక్షకు YSRCP , జనసేన (janasena) ప్రభుత్వాలు సపోర్ట్ చేయడం లేదు.