YCPకి బాలినేని బిగ్ షాక్!
ongole: ప్రకాశం జిల్లా(prakasam district)లో మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Former Minister Balineni Srinivas) తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే మంత్రి ఆదిమూలపు సురేష్(minister suresh), బాలినేని మధ్య కొంత కాలంగా గ్యాప్ నడుస్తోంది. వీరిద్దరికీ ప్రోటోకాల్ విషయంలో మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం. ఇటీవల మార్కాపురం(markapur cm meeting)లో సీఎం సభ జరగగా.. అక్కడ బాలినేని వాహనాన్ని హెలిప్యాడ్ వద్దకు పోలీసులు అనుమతించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన.. సభలో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం జగన్ వెంటనే బాలినేని తిరిగి వచ్చేలా చెయ్యాలని అధికారులు, నాయకులను ఆదేశించారు. అనంతరం బాలినేని సభలో పాల్గొన్నారు. ఈ ఘటన మరువక ముందే.. వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ (ycp Regional Coordinator) పదవికి బాలినేని రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి బాలినేనిని తప్పించిన జగన్ (ap cm jagan).. ఆయనను ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ సమన్వయకర్తగా నియమించారు.
వైఎస్ జగన్‌కు దగ్గరి బంధువైన బాలినేని.. తొలి నుంచి వైసీపీ వెంటే ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని మంత్రి పదవి చేపట్టారు. కానీ మూడేళ్లు తిరిగే సరికి ఆయనను జగన్ పక్కనపెట్టేశారు. అయితే… అదే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌కు మాత్రం మరోసారి మంత్రి పదవి ఇచ్చారు. ఈ విషయంలో బాలినేని కొంత నొచ్చుకున్నారు. ఇస్తే ఇద్దరికీ ఇవ్వాలని,, లేదంటే ఎవరికీ వద్దని సీఎం జగన్‌కు చెప్పగా… ఆయన పట్టించుకోలేదు. ఇక మంత్రి పదవి సురేష్ చేపట్టిన నాటి నుంచి అనేక విషయాల్లో, ప్రొటోకాల్ అంశం, జిల్లా రాజకీయాల గురించి బాలినేని ఏది సూచించిన వైసీపీ పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర నిరాశతో ఉన్నారని సమాచారం.