ఆంధ్రావాలా రీరిలీజ్.. మండిపడుతున్న ఫ్యాన్స్
ఓ సినిమాను రీరిలీజ్ చేయాలంటే.. ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో చూసుకోవాలి. ఇప్పటివరకు రీరిలీజ్ అయిన సినిమాలన్నీ రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించినవే. ఇంకో పాతికేళ్లు అయినా అలాంటి సినిమాలను ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. రీరిలీజ్‌ల హవా నడుస్తోంది కదా అని రాడ్డు రంబోలా సినిమాలు కూడా మళ్లీ రిలీజ్ చేస్తాం అంటే ఎంతటి ఫ్యాన్స్ అయినా ఊరుకోరు కదా. ఇంతకీ ఇప్పుడు ఏ సినిమాను రీరిలీజ్ చేయాలని చూస్తున్నారంటే… యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా.
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమా 2004లో రిలీజ అయింది. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా రక్షిత నటించింది. రాహుల్ దేవ్ విలన్ పాత్రను పోషించారు. ఇందులో తారక్ డ్యుయల్ రోల్‌లో నటించాడు. అయితే ఈ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే నెలలో రీరిలీజ్ చేస్తున్నట్లు ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది చూసిన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు రీరిలీజ్ చేయాల్సినంతగా ఈ సినిమాలో ఏమీ లేదని, దీనికి బదులు రాఖీ, అదుర్స్ రీరిలీజ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ కెరీర్‌లో ది బెస్ట్ అనిపించిన బాద్‌షా సినిమాను రీరిలీజ్ చేసారు. ఆ సమయంలో ఫ్యాన్స్ చేసిన రచ్చ మామూలుగా లేదు. అంతటి మంచి సినిమా తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ కెరీర్‌లో పెద్దగా చెప్పుకునేందుకు స్కోప్ లేని ఆంధ్రావాలా సినిమాను ఎందుకు రీరిలీజ్ చేయాలనుకుంటున్నారో డిస్ట్రిబ్యూటర్లకే తెలియాలి.
పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి సినిమాను మళ్లీ రిలీజ్ చేయడంతో ఈ రీరిలీజ్ హవా మొదలైంది. కాలేజ్ రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి చూసిన బ్లాక్ బస్టర్ సినిమాలను మళ్లీ ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేస్తుంటే.. చిన్నప్పటి జ్నాపకాలు గుర్తుచేసుకుంటూ అభిమానులు మళ్లీ సినిమా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఖుషి, జల్సా, రఘవరన్ బీటెక్, బాద్‌షా సినిమాలను రీరిలజ్ చేసారు. విచిత్రం ఏంటంటే.. సినిమా రిలీజ్ అయినప్పుడు కంటే.. రీరిలీజ్ సమయంలోనే మరిన్ని కలెక్షన్లు వస్తున్నాయి. ఇకపోతే… మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన కెరీర్‌లోనే ది బెస్ట్ అయిన మగధీర సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు అందుకుంటూ ఆస్కార్స్‌కు నామినేట్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమాను కూడా రీరిలీజ్ చేయబోతున్నారు.