Perni Nani రిటైర్మెంట్… జగన్‌కు థ్యాంక్స్ అంటూ..
Vizag: బందరు పోర్టు(bandar port) పనుల ప్రారంభ సభలో YCP ఎమ్మెల్యే పేర్ని నాని(perni nani) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పోర్టు పనులు ప్రారంభించిన సీఎం జగన్ కు(cm jagan) కృతజ్ఞతలు తెలుపుతూ పేర్ని నాని సుదీర్ఘ ప్రసంగం చేశారు. తన ప్రసంగం ప్రజలకు ఇబ్బంది కలిగినా తప్పదని, మళ్లీ జగన్ తో(jagan) సభను పంచుకునే అవకాశం వస్తుందో లేదో తనకే తెలియదు కాబట్టి నేనే మాట్లాడల్సింది మాట్లాడతానన్నారు. ఐతే గత కొంత కాలంగా మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్నినాని వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని వివిధ ప్రెస్ మీట్లలో చెబుతూ వస్తున్నారు. ఇక తాజాగా ఇవాళ సీఎం జగన్ మచిలీపట్నం పోర్ట్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా బహిరంగ సభ జరగ్గా పేర్ని నాని ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇక తాను రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే నాని కుమారుడు పేర్ని కిట్టు(perni kittu).. మూడేళ్ళ నుంచి మచిలీపట్నం నియోజకవర్గం లో యాక్టీవ్ గా తిరుగుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో YCP తరపున కిట్టు కి సీటు ఇస్తారో లేదా.. పేర్ని నాని నువ్వే పోటీ చెయ్యాలని జగన్ కోరతాడో తెలియాల్సి వుంది.