perni nani: జగన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర
vijayawada: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy)ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ.. మాజీ మంత్రి పేర్ని నాని(ex minister perni nani) ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి బరితెగించి వార్తలు రాస్తున్నాయని.. కక్షపూరితంగా సీఎం జగన్‌ను అపఖ్యాతిపాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌పై కోడి కత్తి(kodi kathi)తో దాడి జరిగితే… ఈ ఘటనలో తప్పుడు వార్తలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఏ, పోలీసులు కూడా ఒప్పుకున్నారని.. సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసింది మా పార్టీ వ్యక్తే అని హడావిడిగా దాడి జరిగిన గంట వ్యవధిలోనే అప్పట్లో డీజీపీ చెప్పేశారన్నారు. దాడి జరిగిన తర్వాత కనీసం పరామర్శించకుండా విమర్శలు చేశారు. దాడి ఘటనపై ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తున్నారు.
చంద్రబాబు(chandrababu)పై దాడి జరిగినప్పుడు మహానేత వైఎస్‌ఆర్(ysr) ఖండించారని.. పటిష్ట భద్రత ఉన్న ఎయిర్‌పోర్టు(airport)లోపలికి కత్తి ఎలా వచ్చింది?. హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై వెల్లడించాలని అప్పట్లో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరడం తప్పా?. విశాఖ పోలీసులను ఎవరు ప్రభావితం చేశారు? ఎయిర్‌పోర్టు అధికారులను ఎవరు ప్రభావితం చేశారు? నిందితుడి గురించి విచారించకుండానే స్టేట్‌మెంట్లు ఏ విధంగా ఇస్తారని ఆయన కౌంటర్ వేశారు.