pawan kalyan: నాగబాబుకి పెద్దపదవి ఇవ్వడానికి కారణం అదే!
vijayawada: జనసేన పార్టీలో గత కొంతకాలంగా క్రీయాశీలకంగా పనిచేస్తున్న కొణిదెల నాగబాబుకు(naga babu)… ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్(pawan kalyan) కీలక బాధ్యతను అప్పగించారు. తాజాగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొణిదెల నాగబాబు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకుని, నాగబాబుకు నియామకపత్రాన్ని అందించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతతోపాటు విదేశాల్లో ఉన్న పార్టీ ప్రతినిధులు, అభిమానులను సమన్వయం చేసే పనిని కూడా ఆయనకే అప్పగించారు. ఇక నెల్లూరులో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వేములపాటి అజయ్‌కుమార్‌కి అధికార ప్రతినిధిగా జాతీయ మీడియాను సమన్వయం చేసుకునే బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆయనకు పవన్ నియామకపత్రాన్ని అందజేశారు.
నాగబాబు గతంలోనూ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో యాక్టివ్‌గా పనిచేశారు. పవన్‌కు ఎప్పుడు మద్దతు ఇస్తూ.. వస్తున్న నాగబాబుకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను మద్దతు ఉంది. నిత్యం సామాజిక మాధ్యమాలు, ప్రత్యక్షంగానూ నాగబాబు కార్యకర్తలు, జనసేన అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తూరు. దీంతోపాటు ఎన్నారైలతో కూడా నాగబాబు టచ్‌లో ఉన్నారు. దీంతో ఆ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు పవన్. అంతకు ముందు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉన్న నాగబాబును ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఆయనపై పవన్ మరిన్ని బాధ్యతలు పెంచారు. దీనికి నాగుబాబు సైతం హర్షం వ్యక్తం చేశారు. పార్టీలో ఏవైనా సమస్యలు ఉన్నా.. అసంతృప్తులు వెల్లడైనా నాగబాబు బాగా డీల్ చేస్తారని పవన్ భావిస్తున్నారు. దీంతోపాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన చక్రం తిప్పుతున్నారని, కనీసం తన ఇంట్లోవారికి కూడా పవన్ పదవులు ఇవ్వలేదని వైసీపీ నాయకులు గతంలో విమర్శించారు. ఈ నేపథ్యంలో నాగబాబుకు సముచిత స్థానం కల్పించి.. నాదెండ్ల మనోహర్‌కు సమానంగా పార్టీలో బాధ్యతలు అప్పగించారు.