Modi: ప్రధానిపై పాకిస్థానీ నటి ట్వీట్..పోలీస్ గట్టి కౌంటర్
Delhi: ఓ పాకిస్థానీ నటి(pakistani actress).. భారత ప్రధాని నరేంద్ర మోదీపై(modi) ఫిర్యాదు ఇవ్వాలంటూ ట్వీట్ చేసింది. దాంతో మన దిల్లీ పోలీసులు(delhi police) ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆ పాక్‌లో ఆ పరిస్థితులు రావడానికి కారణం మోదీనే అట. అందుకే ఆయనపై ఫిర్యాదు చేస్తానంటూ పాకిస్థానీ నటి సెహర్ షిన్వరి(sehar shinwari) ట్వీట్ చేసింది.
“దిల్లీ పోలీసుల ఆన్‌లైన్ లింక్ ఉందా? ఇండియన్ పీఎం మోదీ, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రాపై నేను కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నా. నా పాకిస్థాన్‌లో ఈ గొడవలు జరగడానికి కారణం వారే. భారతీయ న్యాయస్థానాలు ఉచితం అంటుంటాయి కదా.. అదే నిజం అయితే నాకు సుప్రీంకోర్టులో న్యాయం దొరుకుతుంది అనిపిస్తోంది” అని ట్వీట్ చేసింది. వెంటనే ఆమె ట్వీట్‌కు దిల్లీ పోలీసులు రిప్లై ఇచ్చారు. “పాకిస్థాన్‌లో న్యాయం జరిగేలా చూసేంత పవర్స్ ఇంకా మాకు రాలేదు. అయినా పాకిస్థాన్‌లో ఇంటర్నెట్ బంద్ ఉన్నప్పుడు మీరు ట్వీట్ ఎలా చేయగలుగుతున్నారు?” అని రిప్లై ఇచ్చారు. దాంతో దిల్లీ పోలీసుల సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. బాగా చెప్పారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.