ఇండియన్ యాక్టర్స్‌ని బుట్టలోవేసుకుంటోంది: పాక్ మంత్రి కామెంట్స్
పాకిస్థానీ నటి మహీరా ఖాన్‌పై.. ఆ దేశ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మహీరా.. బాలీవుడ్‌లో షారుక్ ఖాన్‌తో కలిసి రయీస్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అంతర్గత కారణాల ఆమె ఇండియాకు, బాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. అయితే ఆమె వ్యక్తిత్వం గురించి పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ సందర్భంలో మీరు ఏ రాజకీయనాయకుడికి సపోర్ట్ చేస్తారు అని ప్రశ్నించగా.. నేను పఠాన్‌కే సపోర్ట్ చేస్తాను అన్నారు. ఆమె పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి ఈ వ్యాఖ్యలు చేసారు. దాంతో.. పాక్ సెనేటర్ అఫ్నాన్ ఉల్లా ఖాన్ స్పందించారు. మహీరాకి మానసిక వైకల్యం ఉంది. ఈమెకి అసలు సిగ్గు లేదు. అందుకే ప్రజలు ఈమెని తిడుతుంటారు. మహీరా ఎలాంటిదో ఓ పుస్తకమే రాయచ్చు. డబ్బు కోసం ఇండియన్ యాక్టర్లను బుట్టలో వేసుకుంటుంది. అని ట్వీట్ చేసారు. దాంతో నెటిజన్లు దారుణంగా ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్లే పాకిస్థాన్ అసలు అభివృద్ధి చెందడంలేదని, వీళ్లు ఉన్నంత వరకు పాక్‌ను అసలు ఎవరూ గౌరవించరంటూ ఏకిపారేస్తున్నారు.