NTR జెంటిల్‌మెన్.. కానీ ఆ డైరెక్టర్ నన్ను రేప్ చేసాడు: పాయల్ ఘోష్
ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం మొదలైనప్పటి నుంచి తనకి ఎదురైన సమస్యల గురించి ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది సినీ నటి పాయల్ ఘోష్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో ఆమె హీరోయిన్ తమన్నా ఫ్రెండ్ పాత్రలో నటించింది. ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన ప్రయాణం సినిమాలోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. అయితే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనని రేప్ చేసాడంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసి రచ్చకెక్కింది పాయల్. కొన్నేళ్ల క్రితమే ఈ విషయాన్ని ఆమె బహిర్గతం చేసింది. అయినప్పటికీ పాయల్‌కు ఎవరూ సపోర్ట్‌గా రాలేదు.
అయితే కొన్ని రోజుల నుంచి పాయల్ సౌత్ సినిమా ఇండస్ట్రీ గురించి ట్విటర్‌లో గొప్పగా మాట్లాడుతూ పలు ట్వీట్లు చేసింది. “నేను సౌత్‌కి చెందిన 2 నేషనల్ అవార్డు అందుకున్న దర్శకులు, స్టార్ దర్శకులతో కలిసి పనిచేసాను. కానీ వాళ్లెవరూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. కానీ అనురాగ్ కశ్యప్ మాత్రం నన్ను కలిసిన మూడో రోజే నన్ను రేప్ చేసాడు. అలాంటప్పుడు నాకు మర్యాదనిచ్చిన సౌత్ చిత్ర పరిశ్రమ గురించి నేనెందుకు గొప్పగా మాట్లాడకూడదు? నేను ఎన్టీఆర్‌తో కలిసి నటించాను. కానీ అతను నాతో ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. అతను ఒక జెంటిల్‌మెన్. బాలీవుడ్‌లో మొత్తం అవినీతే ఉంది” అని ట్వీట్స్ చేసింది.
అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయిందని తెలిసినప్పటి నుంచి పాయల్ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్స్ చేస్తోంది. ఆస్కార్ వేడుకకు ఎన్టీఆర్ వేసుకున్న సూట్ గురించి కూడా కామెంట్ చేసింది. “హృదయం నిండా మన దేశంపై ప్రేమ ఉంటే ఇలాగే ఉంటుంది” అని ట్వీట్ చేసింది. అంతేకాదు.. ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడని తాను ఎప్పుడో చెప్పానని అని పేర్కొంది. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు తారక్.. ఆస్కార్ అవార్డుతో దిగిన ఫొటోను పాయల్ ట్వీట్ చేస్తూ మొత్తానికి గెలిచేసాం అని ట్వీట్ చేసింది. ఇలా పదే పదే తారక్‌ను ట్యాగ్ చేస్తూ.. సౌత్ సినిమాల గురించి గొప్పగా చెప్తున్నందుకు కొందరు నెటిజన్లు ఎందుకు సౌత్ సినిమాల గురించి అంతగా ప్రమోట్ చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పాయల్.. బాలీవుడ్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకే సౌత్ సినిమాపై తనకున్న ప్రేమను ఈ రకంగా చూపిస్తున్నానని తెలిపారు.