NTR About Vijay: విజ‌య్ డ్యాన్స్‌కి నేను ఫిదా

NTR About Vijay

NTR About Vijay: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. స్ప్రింగ్‌లాగా ఎంతటి క‌ఠిన‌మైన స్టెప్పులైనా సునాయాసంగా చేసేస్తారు. తార‌క్ స్క్రీన్‌పై డ్యాన్స్ చేస్తుంటే ప్రేక్ష‌కులు అలా చూస్తుండిపోతారంతే. అలాంటిది తార‌క్ త‌మిళ న‌టుడు విజ‌య్ డ్యాన్స్‌కి ఫిదా అయిపోయాడట‌.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా తార‌కే వెల్ల‌డించారు. దేవర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా తార‌క్ చెన్నైలో మీడియాతో స‌మావేశమ‌య్యారు. ఆ స‌మ‌యంలో త‌మ అభిమాన న‌టుడైన విజ‌య్ గురించి ఏమ‌న్నా చెప్పండి అని మీడియా వారు అడ‌గ్గా.. “” డ్యాన్స్ అనేది చాలా క‌ళ‌గా చేయాలి. ఏదో స‌ర్క‌స్ చేస్తున్న‌ట్లుగా ఉండ‌కూడ‌దు. అలా చూసుకుంటే డ్యాన్స్ అంటే విజ‌య్‌దే. విజ‌య్ డ్యాన్స్ చేస్తుంటే చాలా కూల్‌గా ఎలాంటి షో ఆఫ్ లేకుండా చేస్తున్న‌ట్లు అనిపిస్తుంది. నేను విజ‌య్ డ్యాన్స్‌కి అభిమానిని “” అని వెల్ల‌డించారు.

తార‌క్ సీరియ్‌గా ఈ విష‌యం చెప్పారో లేక త‌మిళ ఆడియ‌న్స్ హ్యాపీగా ఫీల‌వుతార‌ని చెప్పారో తెలీదు కానీ ఆయ‌న విజ‌య్ డ్యాన్స్ గురించి అభినందించ‌డం తెలుగు ప్రేక్ష‌కుల‌ను విస్మ‌యానికి గురిచేసింది. పైగా విజ‌య్ న‌టించిన గోట్ సినిమాలోని ఓ పాట‌కు ఆయ‌న వేసిన డ్యాన్స్‌పై ఎన్ని ట్రోల్స్ వ‌చ్చాయో తెలిసిందే. అదీకాకుండా ఇటీవ‌ల కీర్తి సురేష్‌.. చిరంజీవి, విజ‌య్‌ల‌లో డ్యాన్స్ బాగా ఎవరు చేస్తారు అని అడ‌గ్గా.. విజ‌య్ అని స‌మాధానం ఇవ్వ‌డంతో చాలా మంది మూర్ఛ‌పోయిన‌ట్లు స‌మాచారం.