Independence Day: 5 దేశాలకూ ఈరోజే..!
Hyderabad: ఆగస్ట్ 15 అనగానే భారతదేశానికి స్వాతంత్ర్యం (independence day) వచ్చింది అనుకుంటాం. కానీ ఇదే రోజున మరో ఐదు దేశాలకు స్వాతంత్ర్యం వచ్చింది. అవి ఏ దేశాలో తెలుసుకుందాం..!
రిపబ్లిక్ ఆఫ్ కాంగో (republic of congo)
రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు 1960 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం వచ్చింది. అప్పట్లో దీనిని ఫ్రాన్స్ (france) పరిపాలిస్తూ వచ్చింది.
సౌత్, నార్త్ కొరియాలు (south and north korea)
అప్పట్లో కొరియా దేశాలను జపాన్ (japan) పాలిస్తూ ఉండేది. 1945 ఆగస్ట్ 15న ఈ రెండు దేశాలకు స్వాతంత్ర్యం లభించింది. ఆగస్ట్ 15న ఈ దేశాలు నేషనల్ లిబరేషన్ డేగా (national liberation day) సెలబ్రేట్ చేసుకుంటాయి. (independence day)
లిచ్‌టెన్‌స్టైన్ (Liechtenstein)
యూరప్‌లోని (europe) అతిచిన్న దేశమైన లిచ్‌టెన్‌స్టైన్‌కి కూడా ఈరోజు స్వాతంత్ర్యం వచ్చింది. 1865 వరకు ఈ దేశాన్ని జర్మనీ (germany) పాలిస్తూ వచ్చింది. 1866 ఆగస్ట్ 15న దీనికి స్వాతంత్ర్యం లభించింది.
బహ్రైన్ (bahrain)
పెర్షియన్ గల్ఫ్ (persian gulf) దేశమైన బహ్రైన్ ఒక ద్వీప దేశం. యూకే (united kingdom) చెప్పుచేతల్లో ఉండే బహ్రైన్‌కు 1971 ఆగస్ట్ 15న స్వాతంత్ర్యం వచ్చింది. (independence day)