Nita Ambani: 150 ఏళ్ల నాటి హైద‌రాబాదీ సంస్కృతి ఉట్టి ప‌డేలా..!

nita ambani sizzles in 150 year old hyderabadi tradition

Nita Ambani: రిల‌య‌న్స్ సంస్థ‌ల అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వివాహ వేడుక అట్ట‌హాసంగా జ‌రుగుతోంది. ముఖేష్‌. నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మ‌ర్చెంట్‌ల వివాహం ఈ నెల 12న అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈరోజు హ‌ల్ది వేడుక నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో నీతా అంబానీ వేసుకున్న దుస్తులు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ఆమె 150 ఏళ్ల హైద‌రాబాదీ సంస్కృతి ఉట్టిప‌డేలా చౌగోసియా కుర్తా ధ‌రించారు.

దీనిని ప్ర‌ముఖ సెల‌బ్రిటీ ఫ్యాష‌న్ డిజైన‌ర్ మ‌నీష్ మ‌ల్హోత్రా స్పెష‌ల్‌గా డిజైన్ చేసారు. ఈ త‌ర‌హా కుర్తీల‌ను హైద‌రాబాదీ ముస్లిం మ‌హిళ‌లు పెళ్లిళ్లు వేడుక‌ల స‌మ‌యంలో ఎక్కువ‌గా ధ‌రిస్తుంటారు. ఈ చౌగాసియా దుస్తుల సంప్ర‌దాయం 150 ఏళ్ల నాటిది.