Niharika Konidela Divorce: ఆ ఫొటోలు ఎందుకు?
Hyderabad: నిహారిక కొణిదెల విడాకుల (niharika konidela divorce) విషయం సమాప్తమైంది. తన మాజీ భర్త చైతన్య జొన్నలగడ్డతో (chaitanya vj) కలిసి నిన్న కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గుంటూరు ఐజీ కుమారుడైన చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం 2020లో ఉదయ్‌పూర్‌లో గ్రాండ్‌గా జరిగింది. చాలా మంది ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు కానీ కొంతకాలంగా ప్రేమలో ఉన్నవీరు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు కూడా రూమర్స్ ఉన్నాయి. పెళ్లైన ఏడాదికే వీరిద్దరి మధ్య తగాదాలు వచ్చినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత కూడా నిహారిక సినిమాలు చేస్తానని అనడం చైతన్యకు నచ్చలేదని అప్పటినుంచే గొడవలు స్టార్ట్ అయ్యాయని టాక్. ఆ తర్వాత నిహారిక హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో డ్రగ్స్ తీసుకున్నట్లు న్యూస్ వచ్చింది. ఇవన్నీ వారి విడాకులకు కారణలే అని క్లియర్‌గా అర్థమవుతోంది.
కొన్ని నెలల క్రితం నుంచే నిహారిక (niharika) తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలు, చైతన్యతో కలిసి దిగిన ఫొటోలు డిలీట్ చేసేసారు. ఒకరినొకరు సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. అయితే నిహారిక (niharika) పెళ్లి సమయంలో తన తల్లితో కలిసి దిగిన ఫొటోను మాత్రం డిలీట్ చేయలేదు. అఫ్‌కోర్స్ ఆ ఫొటోలో అమ్మ ఉంది కాబట్టి డిలీట్ చేయాలని అనుకోలేదేమో. పైగా పెళ్లి సమయంలో తన తల్లికి హై ఫీవర్ అని కూడా పోస్ట్‌లో పేర్కొన్నారు. మరో విషయం ఏంటంటే.. నిహారిక ఇన్‌స్టాగ్రామ్‌లోని కొన్ని ఫొటోలను చైతన్యే (chaitanya vj) తీసారు. అందుకు నిహారిక పిక్ క్రెడిట్‌లోనూ చైతన్యను ట్యాగ్ చేసింది. ఆ ఫొటోలను కూడా డిలీట్ చేయలేదు. దాంతో కొందరు నెటిజన్స్ ఇక అంతా అయిపోయాక ఎందుకు ఆ ఫొటోలు అని కామెంట్స్ పెడుతున్నారు.