priyanka gandhi రాకతో టీ. కాంగ్రెస్‌లో మొలకలు.. మరి పంట పండేనా?

hyderabad: తెలంగాణలో కాంగ్రెస్‌(t.congress) నాయకురాలు ప్రియాంక గాంధీ(priyanka gandhi)పర్యటన తర్వాత నేతల్లో, కేడర్‌లో నూతనోత్తేజం నిండిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రియాంక గాంధీకి స్వతహాగా.. ఇందిరాగాంధీ(indira gandhi) పోలికలు రావడం ప్రత్యేకత కాగా… ప్రియాంక తన మాటలతోనూ ఆకట్టుకుంటుందని తెలంగాణ ప్రజలకు చూపించారు. అంతేకాకుండా.. నిస్తేజంలో ఉన్న కాంగ్రెస్‌కు ఒక మార్గదర్శకురాలిగా మారాలని స్థానిక నాయకులు భావిస్తున్నారు. నాటి ఇందిరమ్మే మళ్లీ వచ్చిందని …. తమను గట్టెక్కిస్తుందని… పీసీసీ చీఫ్ రేవంత్(tpcc chief revanth) సహా అందరూ ముమ్మాటికీ నమ్ముతున్నారు. ఆ విషయం ప్రియాంకకు కూడా బాగా అర్థమయ్యింది. తెలంగాణ ప్రజలు ఇంకా ఇందిరమ్మను గుర్తుంచుకున్నారంటూ ఆమె ప్రస్తావనను తీసుకొచ్చారు. మాటలు బాగానే ఉన్నాయి. తనను నయా ఇందిరమ్మగా భావిస్తున్న వారికి అన్యాయం చెయ్యనన్న ప్రియాంక… తెలంగాణ విషయంలో ఇకపై ఎలాంటి అడుగులు వేస్తారన్నదే తెలియాల్సి ఉంది.

కర్నాటక ఎన్నికలు ముగుస్తుండటంతో తెలంగాణపై కాంగ్రెస్‌ ఫోకస్‌ పెంచింది. అందుకే రాహుల్‌గాంధీ, జాతీయ నాయకులు ఇక్కడికి వస్తున్నారు. యూత్‌ డిక్లరేషన్‌ పేరుతో టీ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8న తెలంగాణలో నిర్వహించిన సభకు ప్రియాంక హాజరై ప్రసంగించారు. సరైన నాయకుడి కోసం కాంగ్రెస్‌ ఎదురు చూస్తున్న తరుణంలో రేవంత్‌ రెడ్డి లాంటి వ్యక్తి రావడంతో.. మాస్‌ ఇమేజ్‌, ఫాలోయింగ్‌ పెరిగింది. అయితే.. రేవంత్‌ నాయకత్వాన్ని.. తొలి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న కొందరు నాయకులు అంగీకరించట్లేదు. టి.కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత కుమ్ములాటలను మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు. దీంతో ఉన్న నాయకులు ఎవరి దారి వారిదే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. మరి కాంగ్రెస్‌ బతికిబట్టకట్టాలంటే.. కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కోవాలంటే.. రేవంత్‌కు తప్ప ఎవరికీ సాధ్యపడదు. ఇక తెలంగాణ ఎన్నికలకు ఆరు నెలలే సమయం ఉంది. ఈలోపు అయోమయంగా ఉన్న కాంగ్రెస్‌ పరిస్థితి మారుతుందా.. పార్టీ పెద్దలు దృష్టి సారించి.. నాయకుల మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించి కేసీఆర్‌ సర్కార్‌ను ఎదురొడ్డి నిలబడతారో లేదో చూడాల్సి ఉంది.