Nellore: కాలేజీ హాస్టల్లో అబార్షన్.. బీటెక్ విద్యార్థిని మృతి
vijayawada: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా(nellore district)లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి(btec student)కి ఓ కారు డ్రైవర్‌తో సాన్నిహిత్యంగా మెలగడం వల్ల ఆమె గర్బం(pregnency)దాల్చింది. అయితే ఆ యువతికి అయిదు నెలలు వచ్చే వరకు ఈ విషయం తెలియలేదు. పరీక్ష చేయించుకోగా.. గర్భవతి అని తేలింది. దీంతో ఏం చేయాలో తెలియక.. గర్భం రావడానికి కారణమైన వ్యక్తికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అతను అబార్షన్ చేయించుకోవాలని యువతిని బలవంతపెట్టాడు. ఆర్‌ఎంపీ దగ్గర ఏవో మందులు తీసుకొచ్చి వాటిని వేసుకుంటే అబార్షన్ అవుతుందని చెప్పడంతో ఆ మాటలు నమ్మిన యువతి వాటిని వేసుకుంది. దీంతో కడుపునొప్పి వచ్చి.. పిండం బయటకు రావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి హాస్టల్ గదిలోనే ఆమె మృతి చెందింది.
ఎన్నో ఆశలతో బిడ్డల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కలలు కంటుంటారు. వారికి ఎలాంటి లోటు రాకుండా.. నచ్చినవి అన్నీ కొనిస్తుంటారు. పిల్లలు ఓ వయసుకు వచ్చాక తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తారు. తెలిసీ తెలియకుండా ప్రేమ వలలో చిక్కుకుంటారు. వారి జీవితాన్ని అంధకారం చేసుకుంటారు. అలాంటి ఘటనే ఇది. ఇంజినీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో స్థిరపడాల్సిన యువతి తన జీవితాన్ని అర్ధంతరంగా ముగించింది. హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్న బీటెక్ అమ్మాయికి ఇన్‌స్టాగ్రాంలో ఓ ఓ క్యాబ్ డ్రైవర్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వీరి మధ్య కొన్నాళ్లు స్నేహం.. అనంతరం అది ప్రేమగా మారింది. ఈక్రమంలో వారిద్దరు శారీరకంగా దగ్గరయ్యారు. దీంతో యువతి గర్భందాల్చింది. ఇక ఏం చేయాలో తోచలేదు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా అబార్షన్ చేసుకునేందుకు యత్నించిన యువతి.. తీవ్రరక్తస్రావం కావడంతో చనిపోయింది. ఆ సమయంలో విద్యార్థులు కళాశాలలో ఉండటంతో ఎవరూ దీన్ని గుర్తించలేదు. ఆమె గర్భం దాల్చడానికి కారణమైన శశి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.