నరేష్​, పవిత్ర జంటగా ‘మళ్లీ పెళ్లి’!

సీనియర్ నటుడు నరేష్, క్యారెక్టర్​ ఆర్టిస్ట్​ పవిత్రా లోకేష్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలాకాలంగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ వీడియో కూడా పోస్ట్​ చేశారు. ఇక అదే నిజమనేలాగా నరేష్, పవిత్ర లోకేష్ ఓ హోటల్లో ఉండగా వారిద్దరినీ రెడ్ హ్యాండెెడ్ గా పట్టించింది నరేష్ మూడో భార్య రమ్య.. ఇదంతా సద్దుమణుగుతుంది అని అనుకుంటుండగా నూతన సంవత్సరం సందర్భంగా నరేష్ పవిత్ర లిప్ లాక్ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ‘మళ్లీ పెళ్లి’ అనే ప్రకటన #PavitraNaresh అనే హ్యాష్ ట్యాగ్ తో వీడియో వైరల్ అయ్యింది. అంతేకాదు ఈ మధ్య నిజంగానే పెళ్లి చేసుకున్నట్టు ఓ వీడియో కూడా పోస్ట్​ చేసి అందరి ఆశీస్సులు కోరాడు నరేష్​.
అది చూసిన అందరూ నిజమే అని అనుకున్నారు కానీ చివరకి ఇదంతా మళ్లీ పెళ్లి అనే సినిమా ప్రమోషన్లలో భాగమని తెలింది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నరేష్ పవిత్ర మధ్య ఉన్న బంధాన్ని అడ్డం పెట్టుకొని ఈ సినిమా ప్రమోషన్స్ ను చేశారు ఇప్పటివరకు వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని కచ్చితంగా వీళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అనే అనుకున్నారు. కానీ ఇదంతా ఓ సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన తతంగమని తెలిసి ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతయ్యింది.

నరేష్ పవిత్ర ఇద్దరు కలిసి జంటగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా ప్రమోషన్ కోసం ఈ తతంగం అంతా చేశారని తెలుస్తోంది. ఇద్దరికీ పెళ్లయినట్లు, హనీమూన్​ వెళ్లినట్లు కూడా ప్రేక్షకులను బురిడీ కొట్టించారు. పుకార్లతో ఫ్రీగా పబ్లిసిటీ పొందవచ్చని తెలుసుకుని అందుకు తగినట్టు అన్నీ సృష్టించి ట్రెండింగ్​లో నిలిచింది ఈ జంట. ఇక ఈ సినిమాని నరేష్​ స్వయంగా నిర్మిస్తుండగా ఎమ్​ఎస్​ రాజు దర్వకత్వం వహిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్​ చూస్తే వేసవి కానుగా ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది.