Dasara: నార్త్‌లో లేని కలెక్షన్లు.. నాని రియాక్షన్ అదుర్స్!
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సినిమా మొన్న 30న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రిపోర్టులు అందుకుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు 50 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తెలుగు, తమిళం, మలయాళంతో పోలిస్తే.. నార్త్ సైడ్ కలెక్షన్లు బాగా తక్కువగా ఉన్నాయి. ఈ విషయంపై నాని ఓ మీడియా సమావేశంలో స్పందించారు. నేనేమన్నా అమితాబ్ బచ్చన్‌నా? నా కోసం ఫస్ట్ డేనే ఎందుకు ఎగబడతారు? అని తనదైన స్టైల్‌లో ఆన్సర్ ఇచ్చారు. ఇకపోతే నాని కెరీర్‌లోనే దసరా ఓ మైలురాయిగా నిలచిపోతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సినిమా దూసుకెళ్తుంది అని నాని ముందు నుంచే కాన్ఫిడెన్ట్‌గా ఉన్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమా సూపర్ ఉందంటూ దసరా టీంకు అభినందనలు తెలిపారు. ఇక దసరా లాంటి సినిమా ఇప్పట్లో చేయనని కూడా నాని స్పష్టం చేసారు. మున్ముందు ఎలాంటి సినిమాలు చేయాలని తాను ఎప్పుడూ ప్లాన్ వేసుకోలేదని, మంచి స్క్రిప్ట్స్ వస్తే చేసుకుంటూ వెళ్తానని తెలిపారు.