దిల్‌వాలే, టెర్మినేట‌ర్ ఒక‌టేనా? : పుష్ప‌తో ద‌స‌రా పోలిక‌పై నాని కామెంట్

నేచుర‌ల్ స్టార్ నాని నుంచి ఓ ఎక్స్‌ప‌రిమెంట‌ల్ సినిమా రాబోతోంది. అదే ద‌స‌రా. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నానికి జోడీగా కీర్తి సురేష్ న‌టించారు. ఇటీవ‌ల రిలీజ్ అయిన ట్రైల‌ర్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్ప‌టికే సినిమాలోని చంకీల అంగీలేసి పాట‌కు విప‌రీత‌మైన క్రేజ్ వ‌చ్చేసింది. సినిమాను ఈ నెల 30న రిలీజ్ చేస్తున్నారు. సినిమాను ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెలుగుతో పాటు హిందీ, త‌మిళంలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నాని ట్విట‌ర్‌లో స‌ర‌దాగా ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించారు. ఆ సంగ‌తులేంటో చూద్దామా..

ట్రైల‌ర్‌లో ధ‌ర‌ణి ఒక్కొక్క‌ని మొల‌దారం కింద గుడాల్ రాల్తాయ్ బేన్‌చో అని అన్నారు క‌దా..మీ సినిమాలో ఇలాంటి డైలాగులు ఉంటాయ‌ని ఊహించ‌లేదు. దీనికి మీరేలా స‌మ‌ర్ధించుకుంటారు?

ఇందులో స‌మ‌ర్ధించుకోడానికి ఏముంది? ధ‌రణి రాల్తాయ్ అంటే రాల్తాయ్‌. అది బేన్‌చో కాదు బాన్చెత్.

ద‌స‌రా పాటల్లో మీకు ఇష్ట‌మైన‌ది ఏది?

నాకు న‌చ్చిన పాట మాత్రం మేం రిలీజ్ చేయ‌డంలేదు. అది సినిమాలోనే చూడాలి.

ప్ర‌తి సినిమా స్క్రిప్ట్ సాధార‌ణ ఆడియ‌న్స్‌లానే వింటాను అంటారు క‌దా..సినిమాలో ఆడియ‌న్స్ సాటిస్‌ఫై అయ్యే ఎలిమెంట్స్ ఉన్నాయా? ఎక్క‌డో చిన్న భ‌యం ఉంది.

భ‌యం ఏమీ అక్క‌ర్లేదు. టాప్ లిస్ట్‌లో పెట్టేయండి.

వెన్నెల గురించి చెప్పండి

మ్యాజిక్. బ‌తుక‌మ్మ సీన్‌లో చూస్తారుగా

ఎంత‌కాలం కొత్త‌వారికి ఛాన్సులు ఇస్తావ్ అన్నా.. టాప్ డైరెక్ట‌ర్ల‌తో చేయొచ్చుగా?

ట్యాలెంట్‌కి కొత్తేంటి పాతేంటి, తేడా నాకు తెలీదు.

పుష్ప‌, రంగ‌స్థ‌లంల‌తో పోలిస్తే ద‌స‌రా వెరైటీగా ఉంటుందా? నార్త్ ఆడియ‌న్స్ ద‌స‌రా, కేజీఎఫ్ ఒకటే అనుకుంటున్నారు

దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయేంగే, టెర్మినేట‌ర్ సినిమాల్లో హీరోలు లెద‌ర్ బెల్ట్ వేసుకుంటారు క‌దా అని ఆ రెండూ ఒక‌టే అయిపోవు క‌దా.

భ‌లేభ‌లే మ‌గాడివోయ్ సీక్వెల్ ఎప్పుడు?

వాడికి గుర్తొచ్చిన‌ప్పుడు

స‌క్సెస్ అవ్వాల‌న్న కోరిక‌తో మార్గ‌మ‌ధ్య‌లో పోరాడుతున్న యువ‌త‌కు మీరు ఇచ్చే స‌ల‌హా?

ఆపేసి ఓడిపోయినోడు ఉన్నాడు కానీ..

ద‌స‌రాకి మీరే డైరెక్ట‌ర్ అయితే హీరోగా ఎవ‌ర్ని పెట్టుకుంటారు?

న‌న్నే

మీ సినిమాలు చాలా బాగుంటాయ్ కానీ క‌లెక్ష‌న్లు ఎందుకు అంత‌గా రావ‌డంలేదు?

నా నిర్మాత‌లు పూర్తి వ్య‌తిరేకంగా చెప్తున్నారు. కొన్నిసార్లు ఆ ప్రాఫిట్లు నాతో కూడా పంచుకుంటున్నారు.

ద‌ర్శకుడు శ్రీకాంత్ గురించి చెప్పండి?

దొరికాడు మ‌న‌కి ఒక‌డు. ఒరిజిన‌ల్ పీస్

ఇది డైరెక్ట‌ర్ మొద‌టి సినిమాలా అనిపించ‌డంలేదు. బాగా ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న‌వాడిలా తీసాడు

త‌న ఊహ‌ల్లో ఇంకా చాలా తీసాడు.