Nandamuri Chaitanya Krishna: నేనుండగా చంద్రబాబు, బాలయ్యను టచ్ చేయలేరు
Nandamuri Chaitanya Krishna: బ్రీత్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నందమూరి చైతన్య కృష్ణ.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి వార్నింగ్ ఇచ్చారు. నేనుండగా చంద్రబాబు నాయుడు మామయ్యను బాలకృష్ణ బాబాయ్‌ను టచ్ కూడా చేయలేరు అంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు.
“” వైఎస్సార్ కాంగ్రెస్‌కు సపోర్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి ఇదే నా వార్నింగ్. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలు సపోర్ట్ చేసారని అంటున్నారు. మీరెవ్వరూ మా బొచ్చు కూడా పీకలేరు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మామయ్య, బాలకృష్ణ బాలయ్యను నేనుండగా టచ్ కూడా చేయలేరు. నా సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో కలిసి బాగా ట్రోల్ చేసారు. జాగ్రత్తగా ఉండండి “” అని పోస్ట్ పెట్టారు. ఇంత పెద్ద వార్నింగ్ ఇవ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారని టాక్.