ఆ హీరోయిన్‌తో లండ‌న్‌లో నాగ‌చైత‌న్య వెకేష‌న్‌!

సినీ న‌టుడు నాగ‌చైత‌న్య ఓ హీరోయిన్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ కొన్ని నెల‌ల క్రితం టాలీవుడ్‌లో రూమ‌ర్స్ వెలువ‌డ్డాయి. ప్ర‌ముఖ న‌టి శోభితా ధూళిపాళ్ల‌తో చైత‌న్య డేటింగ్‌లో ఉన్న‌ట్లు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. అయితే ఈ విష‌యంపై నాగ‌చైతన్య కానీ శోభిత కానీ ఎలాంటి కామెంట్ చేయ‌లేదు. క‌నీసం అవ‌న్నీ అబ‌ద్ధాలేన‌ని ఇలాంటి రూమ‌ర్స్ న‌మ్మ‌కండి అని సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్ట‌లేదు.

అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ ఫొటో చూస్తుంటే వారిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నార‌న్న విష‌యం నిజ‌మేనేమో అనిపిస్తోంది. నాగ‌చైత‌న్య‌, శోభిత లండ‌న్‌లో వెకేష‌న్‌కు వెళ్లిన‌ట్లున్నారు. రెస్టారెంట్‌లో ప‌నిచేస్తున్న చెఫ్ సురేంద‌ర్ మోహ‌న్‌..నాగ‌చైత‌న్య‌తో ఫొటో దిగారు.  ఆ ఫొటోను సురేంద‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ ఫొటోలో నాగ‌చైత‌న్య వెన‌క శోభిత కూర్చుని ఉన్నారు. అయితే ఆ ఫొటో ఫిబ్ర‌వ‌రి 1న సురేంద‌ర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. కానీ అది ఇప్పుడు వైర‌ల్ అవుతుండ‌డంతో చైత‌న్య‌, శోభిత డేటింగ్‌లో ఉన్నార‌న్న వార్త‌లు నిజ‌మేనేమో అంటున్నారు నెటిజ‌న్లు. స‌మంత‌తో విడిపోయాక చైత‌న్య హైద‌రాబాద్‌లో 15 కోట్లు విలువ చేసే ఫ్లాట్ కొన్నార‌ని, ఈ ఫ్లాట్‌కు శోభిత అప్పుడ‌ప్పుడు వ‌చ్చి వెళ్తుండేవార‌ని కూడా కొద్దిరోజుల పాటు టాక్ న‌డిచింది.

స‌మంత‌, నాగ‌చైత‌న్య విడిపోతున్నట్లు ప్ర‌క‌టించిన త‌ర్వాత స‌మంత మేక‌ప్ స్టైలిస్ట్ జుక‌ల్క‌ర్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టాడు. కంగ్రాట్స్ బిచ్‌.. ఇప్పుడు అత‌ను నీ వాడు అని పోస్ట్ చేసాడు. ఆ త‌ర్వాత కొన్ని నిమిషాల‌కే ఆ స్టోరీని డిలీట్ చేసాడు. దాంతో నాగ‌చైత‌న్య మ‌రో యువ‌తితో ఉండ‌టం వ‌ల్లే స‌మంత‌తో విడిపోయార‌న్న అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. మ‌రి ఇప్ప‌టికైనా చైత‌న్య కానీ శోభిత కానీ స్పందిస్తారేమో వేచి చూడాలి.