Nadendla Manohar: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా నినాదం!
vijayawada: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(tdp chief chandrababu naidu), జనసేనాని పవన్‌కల్యాణ్(janasena party chief pavan kalayan) మరోసారి భేటీ (Chandrababu Pawan Kalyan Meeting) కావడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. వీరు హైదరాబాద్‌లో కలవగా.. ఏపీ ప్రస్తుత రాజకీయాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. అయితే.. ఇటీవల బీజేపీ(bjp) అధిష్టానంతో పవన్ మంతనాలు జరిపారు. చంద్రబాబు కూడా.. రిపబ్లిక్ ఛానల్లో మోదీ(pm modi) నాయకత్వాని పొగిడారు. విజన్ ఉన్న నాయకుడు అంటూ బాబు… మోదీని కొనియాడారు. ఈ నేపథ్యంలో పవన్, చంద్రబాబు కలవడం ఆసక్తికరంగా మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మూడుపార్టీలు కలిసి వైసీపీపై పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేసేస్తున్నారు. అధికారికంగా.. మాత్రం ఏ పార్టీ పొత్తుల అంశంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా చంద్రబాబు, పవన్ భేటీపై జనసేన పార్టీ పీఏసీ సభ్యులు నాదెండ్ల మనోహర్ మాట్లాడారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతోనే చంద్రబాబు, పవన్ కలిశారని మనోహర్ పేర్కొన్నారు. గతంలోనే ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారని చెప్పారు. నిన్న చంద్రబాబుతో పవన్ జరిపిన చర్చల్లోనూ అదే కీలక అంశమని తెలిపారు. భవిష్యత్‌లో వారి మధ్య మరిన్ని చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మంచి ప్రణాళిక, వ్యూహంతో జనసేన అడుగులు వేస్తోందన్నారు. సీట్లపై జరుగుతున్న ప్రచారాలన్నీ ఊహాగానాలేనని తేల్చి చెప్పారు. సీఎం జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని, దాన్ని భరించలేకే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం మంచి మ్యానిఫెస్టో రూపొందించి.. అమలు చేస్తామని తెలిపారు.