Oscar: స్టేజ్‌పై నాటు నాటు పెర్ఫామెన్స్ కేక‌!

కోట్లాది మంది భార‌తీయులు కోరుకున్న విధంగానే ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట‌కు ఆస్కార్ వ‌రించేసింది. ఈ నేప‌థ్యంలో ఆస్కార్ స్టేజ్‌పై నాటు నాటు పాట‌కు సింగ‌ర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైర‌వ లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. వారు ఆ పాట‌ను పాడుతుంటే.. డ్యాన్స‌ర్లు నాటు నాటు డ్యాన్స్‌ను రీక్రియేట్ చేసి ఆడియ‌న్స్‌ను అల‌రించారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లా నాటుగా చేయ‌లేక‌పోయినా.. ఆ డ్యాన్స‌ర్లు వేసిన స్టెప్పులు ఆడియ‌న్స్‌ను ఉర్రూత‌లూగించాయి. చివ‌ర్లో నాటు నాటు హుక్ స్టెప్‌ను అంద‌రు డ్యాన్స‌ర్లు క‌లిసి ఒక వ‌రుస‌లో నిల‌బ‌డి వేయ‌డం హైలైట్‌గా నిలిచింది. ఆ వీడియోను ఓసారి మీరూ చూసేయండి.