నవరాత్రి ఉపవాసం చేస్తున్న ఉరిశిక్ష పడ్డ ముస్లిం ఖైదీలు
Navratri: జైల్లో ఉరిశిక్ష పడ్డ ముస్లిం ఖైదీలతో పాటు ఓ బ్రిటన్ అనే పౌరురాలు నవరాత్రి ఉపవాసం చేయడం వైరల్‌గా మారింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జిల్లా జైలులో 213 మంది శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో 27 మంది ముస్లిం ఖైదీలతో పాటు ఓ బ్రిటన్ పౌరురాలికి ఉరి శిక్ష పడింది. అయితే.. ప్రస్తుతం నవరాత్రలు జరుగుతున్న నేపథ్యంలో వీరంతా తొమ్మిది రోజుల పాటు ఉపవాసం చేస్తున్నారని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఉపవాస వేళలో వారికి పాలు, పండ్లు, ఉడకబెట్టిన ఆలుగడ్డలు పెడుతున్నట్లు వెల్లడించారు. బ్రిటన్‌కి చెందిన రమణ్‌ప్రీత్ కౌర్ అనే యువతి 2016లో తన భర్తను దారుణంగా చంపేసింది. ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు పూర్తయ్యాక 2023లో కోర్టు ఉరిశిక్ష విధించింది.