EXCLUSIVE: కాకరేపుతున్న కాపు రాజకీయం
EXCLUSIVE: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం (mudragada padmanabham) తెలుగు దేశం, జనసేన పార్టీల వైపు ఫోకస్ చేస్తున్నారు. రేపో, మాపో ఆయన జనసేనలో చేరతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏ పార్టీలో చేరినా కూడా తన కుమారుడు లేదా కోడలికి సీటు ఇస్తారన్న ఆశతో ఉన్నారు. నిన్న జనసేన నేత తాతారావు ముద్రగడతో భేటీ అయిన నేపథ్యంలో ఆయన జనసేనలోనే చేరనున్నట్లు ఆల్మోస్ట్ కన్‌ఫాం అయిపోయింది. ఇదే విషయాన్ని ముద్రగడ అనుచరులను అడగ్గా అదంతా వట్టిదే అంటున్నారు. ఇప్పుడే మీడియాకు ఏమీ చెప్పొద్దని ముద్రగడ తన అనుచరులతో చెప్పినట్లు తెలుస్తోంది.