Mithali Raj: ఇక హ‌ర్మ‌న్‌ప్రీత్ కెప్టెన్‌గా అవ‌స‌రం లేదు

Mithali Raj slams harmanpreet kaur

Mithali Raj:  మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ అవ్వ‌డంపై స్పందించారు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్. కూన టీం అయిన సౌతాఫ్రికా అన్నా పెర్ఫామెన్స్ విష‌యంలో మెరుగుప‌డుతూ వ‌చ్చింది కానీ మ‌హిళ‌ల టీం మాత్రం ఇంకా అలాగే ఉంద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేసింది.

“” రెండు మూడేళ్ల నుంచి చూస్తున్నాను. అమ్మాయిల టీంలో ఎలాంటి అభివృద్ధి లేదు. మొన్న ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా సులువుగా గెలిచేదే. టీమిండియా కూన టీంల‌ను బానే ఓడ‌గొడుతోంది. కానీ ఆస్ట్రేలియా లాంటి స్ట్రాంగ్ టీమ్స్‌ని మాత్రం ఓడించ‌లేక‌పోతున్నాయి. సౌతాఫ్రికా లాంటి టీమ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. కానీ అమ్మాయిల టీమ్ మాత్రం ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్లుగా ఉంది. స్లో పిచ్‌ల‌కు అల‌వాటుప‌డేందుకు ఎక్కువ స‌మ‌యం తీసుకుంటోంది.

T20 ప్ర‌పంచ క‌ప్ లాంటి చిన్న టోర్న‌మెంట్ల‌లో పిచ్‌ల‌కు అల‌వాటు ప‌డేందుకు కూడా స‌మ‌యం ఉండ‌దు. ప్ర‌పంచ క‌ప్‌కి ముందు ఆసియా క‌ప్‌కి కూడా స‌రిగ్గా ప్రిపేర్ అవ్వ‌ని వాళ్లు గెలుస్తార‌నుకోవ‌డం మ‌న పొర‌పాటు. బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో మార్పుల వ‌ల్ల చాలా క‌న్‌ఫ్యూజ్ అయ్యారు. టీమిండియాకు మిడిల్ ఓవ‌ర్లు వీక్ స్పాట్ లాంటివి. షెఫాలీ వ‌ర్మ లాంటి ఓపెనర్ల‌పై ఎక్కువ‌గా ఆధార‌ప‌డి మిడిల్ ఆర్డ‌ర్స్‌కి వ‌చ్చేస‌రికి ఇబ్బందిప‌డుతున్నారు. ఏడాది మొత్తం ఆట తీరు, ఫిట్‌నెస్‌కి మెయింటైన్ చేసుకోవాలి. కానీ టోర్న‌మెంట్ వ‌స్తోందంటే దానికి ముందే ఫిట్‌నెస్, ఆటపై దృష్టి పెడుతున్నారు. ఇది క‌రెక్ట్ కాదు. అమ్మాయిల టీంలో స్ట్రాంగ్ ప్లేయ‌ర్ల‌ను పెట్టాల్సింది. కానీ ఆ ప‌ని చేయ‌లేదు. ఇక హ‌ర్మ‌న్‌ప్రీత్ కెప్టెన్‌గా అవ‌స‌రం లేదు అని నా అభిప్రాయం. కెప్టెన్సీని జెమీమా రోద్రిగ్స్ లాంటి యంగ్ అమ్మాయిని పెడితే మంచిది. ఆమెలోని ఎన‌ర్జీ లెవెల్స్ హ‌ర్మ‌న్‌ప్రీత్‌లో లేవు “” అని తెలిపారు మిథాలీ.