‘నా సోదరుడిని మిస్సవుతున్నా..’ ఎన్టీఆర్‌పై రామ్ చరణ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా సినిమా RRR.రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఈ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. అంతేకాదు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ మరియు ఆస్కార్‌కు నామినేట్ అయ్యి సత్తా చాటుకుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఎంతో భారీ స్థాయిలో రూపొంది వందల కోట్ల కలెక్షన్స్ తో పాటు గ్లోబల్ గా ఆడియన్స్ మనసుని ఆకట్టుకున్న ఈ మూవీకి ప్రస్తుతం పలు అంతర్జాతీయ అవార్డులు కూడా లభిస్తున్నాయి. అతి త్వరలో జరుగనున్న ఆస్కార్ అవార్డుల్లో భాగంగా ఆర్ఆర్ఆర్ మూవీ నుండి నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక త్వరలో జరుగనున్న ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ఇప్పటికే అమెరికా చేరుకున్న రామ్ చరణ్, ఎప్పటికప్పుడు అక్కడి మీడియా తో ఇంటరాక్ట్ అవుతుండడంతో పాటు పలు విధాలుగా ఫ్యాన్స్ ని పలకరిస్తున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో తెరపై రామ్ చరణ్, ఎన్టీఆర్ మధ్య అనుబంధం ఎంత బాగా కుదిరిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సినిమా పొందిన ఆదరణే అందుకు సాక్ష్యం. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లోనూ ఈ ఇద్దరు హీరోల అల్లరి ఎంతో ప్రత్యేకంగా నిలిచి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తాజాగా ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ అయిన సందర్భంగా యుఎస్ఏ లోని థియేటర్ లో సందడి చేసిన చరణ్, ఫ్యాన్స్ పలు సన్నివేశాల్లో లేచి నిలబడి తమ సీన్స్ ని అభినందించిన తీరుకు ఎంతో సంతోషం వ్యక్తం చేసారు. లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా పలు ఆర్ఆర్ఆర్ తో పాటు తన స్నేహితుడు ఎన్టీఆర్ గురించి పలు ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసారు రామ్ చరణ్. మగధీర కి మాత్రమే కాదు ఆర్ఆర్ఆర్ కి కూడా తాను స్టూడెంట్ నే అని, రాజమౌళి గారిని కలిసిన ప్రతి సారి ఎంతో నేర్చుకున్నానని, నిజానికి ఆర్ఆర్ఆర్ కి ముందు కొంత గ్యాప్ తీసుకుందాం అని భావించినప్పటికీ అదే సమయంలో ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి కలిసారని అన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘సోదర సమానుడు ఎన్టీఆర్ ని ఈ సందర్భంగా చాలా మిస్ అవుతున్నా. కారణాలు చెప్పలేనప్పటికీ ఇన్నేళ్ల పాటు నేను ప్రత్యేకంగా ఎన్టీఆర్ తో ఎక్కువుగా ఇంటరాక్ట్ అవ్వలేకపోయా. ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో మా ఇద్దరి మధ్య ఎంతో గొప్ప అనుబంధం ఏర్పడింది. మా ఇద్దరినీ హీరోలుగా పెట్టి ఆర్ఆర్ఆర్ తీసినందుకు రాజమౌళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్టీఆర్ కి ప్రత్యేక పనులు ఉండడం వల్లే ఇక్కడికి రాలేదు. తాను ఎప్పటికీ నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నా.’ అంటూ ఎన్టీఆర్‌పై తన అభిమానం చాటుకున్నారు.