మైనర్‌తో టీచర్ ప్రేమాయణం!
పిల్లలకు ఏది మంచో ఏది చెడో చెప్పాల్సిన టీచరే.. సిగ్గుపడే పనులు చేస్తుంటే ఇక ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటారు. చదువుకోవాల్సిన వయసులో టీచర్ అందంగా ఉందని ప్రేమలో పడి ఇంట్లోవారి గురించి ఆలోచించకుండా లేచిపోయి సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారో వారికే తెలియాలి. ఈ ఘటన హైదరాబాద్‌లోనే జరిగింది. హైదరాబాద్ శివారులోని చందానగర్‌కు చెందిన ఓ యువతి (26) స్థానిక ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. అదే పాఠశాలలో గచ్చిబౌలికి చెందిన బాలుడు (15) పదో తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు కూడా. దాంతో ఆ యువతి తాతయ్య చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకే ఆమె తిరిగి ఇంటికి రావడంతో కేసును విత్‌డ్రా చేసుకున్నారు.
అదే సమయంలో తమ కుమారుడు కనిపించడం లేదంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత బాలుడు కూడా ఇంటికి చేరుకున్నాడు. ఎక్కడికెళ్లావంటూ బాలుడిని పోలీసులు ప్రశ్నించడంతో వీరి మధ్య ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. టీచర్‌తో కలిసి ఈ ఫిబ్రవరి 16న వెళ్లినట్టు చెప్పాడు. దీంతో ఆమెను కూడా పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉపాధ్యాయురాలికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తుండడంతోనే ఆమె ఇలా చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.