Peddi Reddy: ఏకంగా సీఎంని చేసేస్తారా?

AP: కుప్పం YSRCP ఎమ్మెల్యే అభ్యర్ధి భరత్‌ను (bharat) ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తాం అంటూ మంత్రి పెద్ది రెడ్డి (peddi reddy) నోరు జారారు. చిత్తూరు జిల్లాలో ఏర్పాటుచేసిన ప‌ల్లెబాట కార్య‌క్ర‌మంలో పెద్ది రెడ్డి పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ భ‌ర‌త్‌ను ఎమ్మెల్యే చేస్తే సీఎం జ‌గ‌న్ (ap cm jagan) మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌న్నారు అని చెప్ప‌బోయి ఏకంగా ముఖ్య‌మంత్రిని చేస్తారు అనేసి నాలుక క‌ర్చుకున్నారు. దాంతో ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.