పాట పాడిన వ‌రుడు.. ఆగిపోయిన పెళ్లి!

ఓ వరుడి అత్యుత్సాహం అత‌ని పెళ్లి పెటాకుల‌య్యేలా చేసింది. వేడుక‌లో త‌న‌కు కాబోయే భార్య‌ని, వ‌చ్చిన అతిథుల్ని మెస్మ‌రైజ్ చేయాల‌నుకున్నాడు. ఇందుకోసం తాను ముందుగానే ప్రిపేర్ అయ్యి ఓ పాట పాడాడు. దాంతో ఆ పెళ్లి కాస్తా ఆగిపోయింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకెళితే.. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మౌ జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తికి అదే ప్రాంతానికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చ‌య‌మైంది. బుధ‌వారం పెళ్లి ఘ‌నంగా జ‌ర‌గాల్సి ఉంది. వ‌రుడు, అత‌ని బంధువులు పెళ్లి మండ‌పానికి చేరుకున్నాక సంప్ర‌దాయం ప్ర‌కారం వధువు త‌ర‌ఫువారు ఘ‌నంగా ఆహ్వానం ప‌లికారు. ఈ నేప‌థ్యంలో వ‌రుడు ఒక్క‌సారిగా పాట పాడ‌టం మొద‌లుపెట్టాడు. బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారుక్ ఖాన్ న‌టించిన బాద్‌షా సినిమాలోని మ‌ర్తే ద‌మ్ త‌క్ లేకర్ జావూంగా దుల్హ‌న్ అంటూ పాట పాడాడు. దాంతో వ‌ధువుతో పాటు అక్క‌డున్న‌వారంతా అవాక్క‌య్యారు. అది స‌ర‌దాగా అనిపించ‌క‌పోగా.. వ‌రుడికి ఏదో మాన‌సిక రోగం ఉందేమోన‌ని వధువు భ‌య‌ప‌డింది. దాంతో పెళ్లి ర‌ద్దు చేసుకుంది. త‌ల్లిదండ్రులు చెప్పినా కూడా వినిపించుకోలేదు. దాంతో పెళ్లి వేడుక‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. విష‌యం తెలుసుకున్న పోలీసులు వెంట‌నే ఘట‌నా స్థ‌లానికి చేరుకుని విచారించారు. అయినా కూడా వ‌రుడు భ‌య‌ప‌డ‌కుండా జ‌రిగిన విష‌యాన్ని పోలీసుల‌కు చెప్పాడు. ఇక చేసేదేంలేక పోలీసులు వ‌ధువు కుటుంబీకుల‌ను పంపించేసారు. ఈ ఘ‌ట‌న‌ను అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి వీడియో తీయ‌డంతో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.