ప్రేమపై మంచు మనోజ్​ ఎమోషనల్​ పోస్ట్​!

డైలాగ్​ కింగ్​ మంచు మోహన్​ బాబు వారసుడిగా టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చారు మంచు మనోన్​. జయాపజయాలు పట్టించుకోకుండా వరుస సినిమాలు చేసిన మనోజ్​ సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. కొన్నాళ్లుగా సినిమాలకి కాస్త దూరంగా ఉన్నా సోషల్​ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నాడు మనోజ్​. ఇక, మనోజ్ గత నెలలో భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి పెళ్లి జరిగి సోమవారం(ఏప్రిల్​ 03)తో సరిగ్గా నెల రోజులయ్యింది. ఈ సందర్భంగా ఇన్​స్టాగ్రామ్​లో వీడియో షేర్​ చేస్తూ ఎమోషనల్​గా పోస్ట్​ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్​ వైరల్​గా మారింది.

గత కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా విష్ణు గొడవ పడుతున్న వీడియోని మనోజ్ స్వయంగా పోస్ట్ చేయడంతో వైరల్​గా మారింది. ఇటు సోషల్​ మీడియాలోనూ, అటు మీడియాలోనూ వీడియో చక్కర్లు కొట్టింది. అయితే అది నిజం కాదంటూ ఓ రియాలిటీ షో అంటూ వివరణ ఇస్తూ విష్ణు వీడియో విడుదల చేసినా ఎవ్వరూ నమ్మడం లేదు. ఇక తాజాగా మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన స్టోరీ అలాగే వైరల్ అవుతుంది. మనోజ్ మార్చి 3వ తారీఖున భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారంతో (ఏప్రిల్ 3) వీరి పెళ్లి అయ్యి నెల పూర్తవడంతో, ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక వీడియో షేర్ చేశాడు మనోజ్​.

ఆ వీడియోలో మనోజ్, మౌనిక నడుచుకుంటూ వస్తుంటే, వీడియో బ్యాక్ గ్రౌండ్ లో ‘ప్రియా ప్రియా చంపోదే’ పాట వస్తుంది. ఇక ఈ వీడియోకి.. ‘ప్రేమించు, ప్రేమ పంచు, ప్రేమగా జీవించు’ అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు మనోజ్​. కాగా వీరిద్దరిది ప్రేమ వివాహం అయినప్పటికీ ఇద్దరికీ ఇది రెండో పెళ్లి. ఈ పెళ్లి మంచు విష్ణుకి ఇష్టం లేదని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకనే పెళ్లికి చుట్టం చూపులా వచ్చి వెళ్లి పోయాడనీ, సంగీత్​, మెహందీ, హల్దీ కార్యక్రమాల్లో ఎక్కడా మంచు విష్ణు కనిపించలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, మనోజ్​, మౌనికల పెళ్లి బాధ్యతలను మంచు లక్ష్మి తీసుకుందనీ, తనే దగ్గరుండి వీరి పెళ్లి ఘనంగా జరిపించిందని టాక్​.