కాబోయే భార్య‌ను ఎంత అందంగా ప‌రిచ‌యం చేసారో!

టాలీవుడ్​ హీరో మంచు మనోజ్​ పెళ్లి ఈ రోజు ఘనంగా జరగనుంది. ఈ పెళ్లికి సినీ ప్రముఖులు, బంధుమిత్రులు హాజరవనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్​ కింగ్​ మంచు మోహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన హీరో మంచు మనోజ్​. ప్రత్యేకమైన డైలాగ్​ డెలివరీతో తనకంటూ ఇమేజ్​ క్రియేట్​ చేసుకుని టాలీవుడ్​లో రాణిస్తున్నారు. కొన్నాళ్లుగా సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా అభిమానులకు మాత్రం సోషల్​మీడియా ద్వారా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారు మనోజ్​. తాజాగా తన పెళ్లి శుభవార్తనీ అభిమానులతో పంచుకున్నారు మనోజ్​. కొన్నేళ్ల క్రితమే మనోజ్‌కు పెళ్లి జరిగినప్పటికీ పలు కారణాలతో ఆయన విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి చాలాకాలం అజ్ఞాతంలో ఉన్న ఈ టాలెంటెడ్ హీరో.. కొన్నాళ్ల నుంచి మౌనికా రెడ్డితో కనిపించారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.
కాగా, మార్చి 3వ తేదీన మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి పెళ్లిక ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మార్చి 2వ తేదీన మంచు వారి ఇంట పెళ్లి సందడి మొదలైంది కూడా. ఈ సందర్భంగా మెహెందీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇక, ఈరోజు సంగీత్ జరగనుంది. ఈ కార్యక్రమానికి దగ్గరి బంధువులు, పలువురు ప్రముఖులు మాత్రమే హాజరవుతారని తెలుస్తోంది.
మనోజ్​ వెడ్స్​ మౌనిక


ఈ నేపథ్యంలో తన పెళ్లిపై తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చాడు మంచు మనోజ్‌. ఈ సందర్భంగా కాబోయే భార్య ఫొటోను షేర్‌ చేశాడు. కొత్తపెళ్లి కూతురు అంటూ ముస్తాబైన మౌనిక ఫొటోను తన ట్విటర్‌లో పంచుకున్నాడు. అంతేకాదు దీనికి ‘మనోజ్‌ వెడ్స్‌ మౌనిక’ అంటూ హార్ట్‌ ఎమోజీని జత చేశాడు. కాగా తన సోదరి, నటి మంచు లక్ష్మి ఇంట ఈ రోజు రాత్రి 8:30 గంటలకు ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరగనుంది. మనోజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మౌనికా రెడ్డి దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె. ఇక మనోజ్‌ ట్వీట్‌పై శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఈ కొత్త జంటకు విషెస్‌ తెలుపుతున్నారు.
కొత్త జీవితంలోకి
మంచు ఫ్యామిలీ అంతా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ లో మునిగితేలుతున్నారు. పెళ్లి వేడుకలను గణపతి, మహా మంత్ర పూజతో ప్రారంభించినట్టు తెలుస్తోంది. పెళ్లి వేడుక మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నివాసంలో జరగనుంది. పెళ్లిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని టాక్. తమ అభిమాన హీరో మంచు మనోజ్ జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నారని అభిమానులు సంబరపడుతున్నారు.