మంచు మనోజ్ పెళ్లికొడుకాయెనే.. ఫోటోలు షేర్ చేసిన మంచు లక్ష్మి!
మంచు మనోజ్-మౌనిక రెడ్డి వివాహం మార్చి 3న రాత్రి 8:30 గంటలకు ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మీ ఇంట్లో జరగనుందని తెలుస్తోంది. మంచు లక్ష్మీ మెహందీకి సంబంధించిన ఫొటోలు షేర్ చేయగా.. మనోజ్ తనకు కాబోయే భార్య అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తాజాగా మంచు లక్ష్మి ట్విటర్ వేదికగా మనోజ్‌ని పెళ్లి కొడుకుని చేసిన ఫొటో పంచుకోవడంతో అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. కొన్ని రోజులుగా మంచు మనోజ్ మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ దీనిపై అధికారికంగా స్పందించలేదు. కానీ ఇద్దరూ కలిసి బయట కనపడటం, మనోజ్ సినిమాని మౌనిక పోస్ట్ చేయడంతో వీరిద్దరి పై మరిన్ని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మనోజ్ భూమికను నేడు పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా నేడు మనోజ్ అధికారికంగా భూమా మౌనిక ఫోటోని పోస్ట్ చేసి పెళ్లికూతురు, మనోజ్ వెడ్స్ మౌనిక అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇద్దరికీ రెండో పెళ్లి కావడంతో కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరగబోతుంది. నేడు ఫిలింనగర్ లోని మోహన్ బాబు ఇంట్లో మనోజ్ మౌనిక ల వివాహం జరగనుంది. దీంతో పలువురు ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు మనోజ్ కి, మౌనికకు కంగ్రాట్స్ చెప్తున్నారు.
బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మంచు మనోజ్ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే మోహన్ బాబు రేంజ్ లో మాత్రం అంతగా పేరు తెచ్చుకోలేకపోయాడు. చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి.. 2015లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ ప్రేమ వివాహం కాస్తా విడాకులవైపు వెళ్లింది. ఇద్దరి మధ్య మనస్పర్థల కారణంగా 2019లో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. తన విడాకుల గురించి సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన మంచు మనోజ్ మళ్లీ సరికొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని కూడా తెలిపాడు. ఆ తర్వాత మంచు మనోజ్ పర్సనల్ విషయాలపై అనేకంగా పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా మనోజ్ రెండో పెళ్లి గురించి రూమర్స్ తెగ వైరల్ అయ్యేవి. ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె భూమా మౌనికతో మనోజ్ వివాహం జరగనున్నట్లు కథనాలు వచ్చాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మంచు మనోజ్, మౌనిక రెడ్డి ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు. మార్చి 2 నుంచే ప్రీ వెడ్డింగ్ పనులు మొదలు కాగా మెహందీ, సంగీత్ కార్యక్రమాలను నిర్వహించారు. మరికాసేపట్లో మనోజ్, మౌనిక జంట పెళ్లి పీటలెక్కనుంది.