అమ్మంటే.. అంతే!
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు కూతరు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ అందరినీ అలరిస్తారు లక్ష్మి. ఇంట్లో జరిగే శుభకార్యాల దగ్గర నుంచి తన కూతురు స్కూల్ కు వెళ్లి వచ్చే వీడియోల వరకు అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. తన పేరు మీద ఓ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి హోం టూర్లు, వంటలు, ఫ్యాషన్, పేరెంటింగ్ వంటి విశేషాలతో లక్షల్లో సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నారు. అంతేకాదు కొత్త సినిమాల ఆల్ ది బెస్ట్ చెప్తూ.. కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ ఉంటారు లక్ష్మి. తాజాగా మంచు లక్ష్మి తన కూతురుతో చేసిన రీల్ వైరల్గా మారింది. ఈ రీల్లో లక్ష్మి సోఫాలో కూర్చుని పిల్లలు, పేరెంటింగ్ అంశాలపై ప్రేక్షకులకు సందేశాన్నిస్తుంటే.. మధ్యలో తన కూతురు నిర్వాణ మాటిమాటికీ కెమెరాకు అడ్డుగా వచ్చి డిస్ట్రబ్ చేస్తుంది. నాలుగు సార్లు ఓపిగ్గా చెప్పిన లక్ష్మి అయిదోసారి మాత్రం వీడియో రికార్డవుతున్న విషయం మర్చిపోయినట్టు కూతురిపై అరిచేస్తుంది. ‘అమ్మంటే.. అంతే..’, ‘అదీ లెక్క..’, ‘సో క్యూట్…’ అంటూ, ఈ వీడియో ఇంట్లో అమ్మ ఎలా పిల్లలపై అరుస్తుందో చక్కగా వివరిస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
అలానే దసరా సినిమా రిలీజ్ సందర్భంలో నానికి విషెస్ తెలుపుతూ.. ఈ సినిమాలోని చమ్కీల అంగీయేసి చాకు లెక్క ఉండేటోడే సాంగ్ కు గులాబీ రంగు చీరలో స్టెప్పులేసింది లక్ష్మి. ఇక ఈ రీల్ చివరిలో లక్ష్మీ కూతురు ఎంట్రీ అదిరిపోయింది. తన తల్లి ఇలా ఉంటుంది అన్నట్లు.. నోరు విడిచి అడగదురా.. చెప్పింది చేయదు రా.. పక్కింట్లో కూర్చొని చాడీలు చెప్తుంది అంటూ చెప్పుకు రావడంతో ఆశ్చర్యపోయిన లక్ష్మీ.. తన కూతురు నోరుపై చెయ్యి అడ్డుపెట్టి లాకెళ్లి పోయింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. తల్లీ కూతుళ్లు సో క్యూట్ అంటూ మురిసిపోతున్నారు అభిమానులు.