మెట్రోలోనే స్నానం.. వీడియో వైరల్..!
అటెన్షన్ కోసం పాపులారిటీ కోసం కొందరు ఎంతకైనా తెగిస్తారని పై ఫొటోను చూస్తే తెలుస్తోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఏమాత్రం సిగ్గు, భయం లేకుండా ఓ వ్యక్తి మెట్రోలోనే స్నానం చేసేసాడు. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటుచేసుకుంది. న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ సూట్‌కేస్‌తో మెట్రో ఎక్కాడు. కొద్దిసేపటికి సూట్‌కేస్ తెరిచి అందులో రెండు కాళ్లు పెట్టి దుస్తులు విప్పేసాడు. ఆ తర్వాత ఒంటిపై నీళ్లు చల్లుకుని షవర్‌జెల్‌తో శుభ్రం చేసుకుని ఒళ్లంతా తుడుచుకున్నాడు. చుట్టుపక్కన ఉన్న ప్రయాణికులు ఇబ్బందికరంగా ఉండడంతో పక్కకు జరిగి అలా చూస్తుండిపోయారు. అతను స్నానం చేస్తున్నప్పుడు ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దాంతో 14 మిలియన్ వ్యూస్‌తో ఈ వీడియో వైరల్ అవుతోంది. అయితే ఆ వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
మొన్న దిల్లీలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువతి దిల్లీ మెట్రో రైలులో బ్రా, స్కర్ట్ మాత్రమే వేసుకుని రైలెక్కింది. దాంతో ప్రయాణికులు కంగుతిన్నారు. సిగ్గులేకుండా అలా ఎలా వేసుకుంటారు అంటూ ఆడవారు కూడా తిట్టిపోసారు. ఓ ప్రయాణికుడు ఆ అమ్మాయిని వీడియో తీసి మెట్రో అధికారులకు షేర్ చేసాడు. దాంతో అధికారులు ఆమెను మందలించారు. ఇంత జరిగినా ఆమె తాను చేసిన పనికి క్షమాపణ చెప్పలేదు. నేను ఇలాంటి డ్రెస్ వేసుకోవడం తప్పైనప్పుడు, మెట్రోలో వీడియోలు తీయడం కూడా తప్పే కదా అంటూ తనని తాను సమర్ధించుకుంది. ఈ సోషల్ మీడియా వాడకం ఎక్కువైపోవడంతో యువత పాపులారిటీ కోసం దేనినీ లెక్కచేయకుండా మితిమీరి ప్రవర్తిస్తున్నారు.