ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ పేరుతో బాలికపై అత్యాచారం
Viral News: ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో అత్యాచారం చేసిన యువకుడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. నారాయణగూడకు చెందిన 8వ తరగతి బాలిక(13) ఆగాపురకు చెందిన బైక్ మెకానిక్ షేక్ ఆర్బాస్(23)కు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆ తర్వాత ఆర్బాస్ పెళ్లి చేసుకుంటానని చెప్పి బాలికను గుల్బర్గా తీసుకెళ్లాడు. అక్కడ పలుమార్లు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు చేయగా.. పోలీసులు విచారణ చేపట్టి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.