Government Job: అధికారుల నిర్ల‌క్ష్యం.. చేజారిన ప్ర‌భుత్వ ఉద్యోగం

man lost government job due to officials negligence

Government Job: ప్ర‌భుత్వ ఉద్యోగం అనేది అంత సులువుగా అంద‌రికీ దొరికేది కాదు. కృషితో పాటు కూసింత అదృష్టం కూడా ఉండాలి. కానీ.. అధికారుల నిర్లక్ష్యం వ‌ల్ల ఓ వ్య‌క్తి ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. గంగాపూర్‌కు చెందిన బి. నాగరాజు బీఎస్సీ చదివి తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్‌లో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఒకే ఉద్యోగం ఉండటంతో ఇంటర్వ్యూకు అర్హత సాధించాడు. సెప్టెంబరు 27న ఇంటర్వ్యూకు హాజరు కావాలని అధికారులు సెప్టెంబరు 4న స్పీడ్ పోస్టు ద్వారా లేఖ పంపారు. ఆ లేఖ నాగరాజుకు ఒక నెల తర్వాత, ఈ నెల 4న అందింది. ఇంటర్వ్యూ గడువు ముగియడంతో నాగరాజు ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఈ విషయమై నాగరాజు వెళ్లి పోస్ట్ ఆఫీస్ అధికారులను అడగగా తమకు 4వ తేదీనే లేఖ వచ్చింద‌ని అప్పుడే తామూ పంపించామ‌ని సమాధానం ఇచ్చారు. చేసేదేమీ లేక ఆ యువ‌కుడు ఏడుస్తూ ఇంటికెళ్లిపోయాడు.