Mahesh Babu: ఇది మీ కోసమే నాన్న!

Hyderabad: నేడు(మే 31) నటశేఖరుడు సూపర్​స్టార్ కృష్ణ(Krishna) జయంతి సందర్భంగా ఆయన తనయుడు మహేష్​ బాబు(Mahesh Babu) సోషల్​ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మహేష్ SSMB28 నుంచి పోస్టర్​ను రిలీజ్​ చేస్తూ ‘ఇది మీ కోసమే నాన్నా’ అంటూ రాసుకొచ్చారు.

‘నాన్నగారి వీరాభిమానుల్లో నేనూ ఒకడిని.. మా అభిమానులందరికీ సూపర్​స్టార్​ కృష్ణగారు, పద్మాలయా స్టూడియోస్​ బ్యానర్​పై తీసిన ఎన్నో గొప్ప సినిమాల్లో మోసగాళ్లకు మోసగాడు అంటే ప్రత్యేకమైన ప్రేమ, అభిమానం. ఆ రోజుల్లోనే హాలీవుడ్ చిత్రాలను తలదన్నేస్థాయిలో ఒక తెలుగు చిత్రాన్ని నిర్మించి విజయవంతం చేసిన సాహసి నాన్నగారు. 52 ఏళ్ల క్రితమే గుర్రాలు, గన్​ఫైటింగ్​లు, భారీ సెట్టింగ్​లు, బ్యూటీఫుల్​ లొకేషన్స్​, ట్రెషర్​ హంట్​, అతి పెద్ద తారాగణం, కౌబాయ్​ గెటప్స్​తో బడ్జెట్​ పరిధులు దాటి, తెలుగు ప్రేక్షకులకి మాత్రమే కాదు, ఇంగ్లీష్​, హిందీ, తమిళ, బెంగాలీ వంటి అన్ని భాషల్లోనూ ఈ సినిమా 50 దేశాల్లో చూపించిన ఘనత నాన్నగారిది. ఈ సంవత్సరం మే 31న (నేడు) నాన్నగారి జయంతి సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్​లో రీ రిలీజ్​ చేస్తున్నాం. తెలుగు సినిమాకి ప్రతి కొత్తక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన లెజెండ్​ అండ్​ విజనరీ నాన్నగారు.. మొదటి స్టీరియో సౌండ్​, మొదటి సినిమా స్కోప్​, మొదటి సెవెన్టీ ఎమ్​ఎమ్​, మొదటి జేమ్స్​బాండ్, మొదటి కౌబాయ్​.. ఇలా అన్ని కొత్త హంగుల్ని తెలుగు సినిమాకు తెచ్చి, తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన నాన్నగారి జ్ఞాపకార్థం మనందరం మళ్లీ మోసగాళ్లకు మోసగాడు డిజిటల్​లో కొత్తసాంకేతిక విలువలతో చూసి ఆ ఆనందాన్ని అనుభూతిని అనుభూతి పొంది ఆయనని స్మరించుకుందాం’ అంటూ ఘనంగా నివాళి అర్పించారు మహేష్​.