Resume ఇలా క్రియేట్ చేస్తే జాబ్ ప‌క్కా..!

Resume: ఎవరైనా ఉద్యోగానికి అప్లై చేయాలంటే ముందుగా వాళ్లకి రెజ్యూమ్‌ పంపాలి లేదా జాబ్ పోర్టల్స్‌లో అప్‌లోడ్ చేయాలి. అప్లై చేసిన కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ రావాలంటే ఆ రెజ్యూమ్‌ రిక్రూటర్లను ఆకర్షించేలా ఉండాలి. ప్రస్తుతం జాబ్ మార్కెట్ చాలా డైనమిక్‌గా మారిపోయింది. ఫలితంగా ఉద్యోగ స్వభావం, ప్రాధాన్యతల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. గతంలో ఒక వ్యక్తి ఓ ఉద్యోగంలో చేరితే 20 నుంచి 30 ఏళ్లపాటు అదే కొలువులో కొనసాగేవారు. కానీ, ప్రస్తుతం ఎవరూ స్థిరంగా ఒకేచోట, ఒకే ఉద్యోగంలో ఉండటంలేదు. ప్రపంచ వ్యాప్తంగా పోటీతత్వం ఫలితంగా ఒక ఉద్యోగి.. ఐదేళ్ల కాలవ్యవధిలోనే సగటున రెండు, మూడు కంపెనీలు మారుతున్నట్లు అంచనా.

ఇక, 2024లో రిక్రూటర్‌లు మీ రెజ్యూమ్‌ని 6-8 సెకన్ల పాటు మాత్రమే చూస్తారు. ఉద్యోగాల కోసం ఎక్కువ మంది వ్యక్తులు దరఖాస్తు చేస్తున్నందున, ఆ తక్కువ సమయంలో మీ రెజ్యూమ్‌ను ప్రత్యేకంగా ఉంచడం చాలా ముఖ్యం. కంప్యూటర్ సిస్టమ్స్ రిక్రూటర్స్ వినియోగానికి (ATS) బాగా పని చేసే చక్కగా తయారు చేసిన రెజ్యూమ్‌ను రూపొందించడం ఇప్పుడు గుర్తించబడటం చాలా ముఖ్యం. అందుకే రెజ్యూమ్‌ ప్రిపేర్ చేసేప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. రెజ్యూమ్‌ ప్రిపేర్ చేయడానికి ఓ ఫార్మాట్ ఉంటుంది. చాట్‌జీపీటీ సహాయంతో ఇప్పుడు రెజ్యూమ్‌ క్రియేట్ చేయడం చాలా సులభమైపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఇక్కడ తెలుసుకుందాం. (Resume)

ముందుగా రెజ్యూమ్‌ అనేది వీలైనంత సింపుల్‌గా ఉండాలి. పేజీల కొద్దీ రాయడం వల్ల ఫలితం లేదు. సీవీ అనేది ఒక పేజీలోనే క్లుప్తంగా ఉండాలి. అందులోనే వివరాలన్నింటినీ క్లియర్‌గా పొందుపరచాలి. అయితే అన్ని రకాల పోస్టులకూ ఒకే రకమైన రెజ్యూమ్‌ పనికిరాదు. అప్లై చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి రెజ్యూమ్‌ అప్‌డేట్ చేస్తుండాలి. ఆయా జాబ్స్‌కు ఏయే స్కిల్స్ అవసరమో తెలుసుకుని దానికి తగ్గట్టుగా రెజ్యూమ్‌ని ప్రిపేర్ చేయాలి. అప్లై చేస్తున్న ఉద్యోగానికి తగిన నైపుణ్యాల గురించి సీవీలో కచ్చితంగా ప్రస్తావించాలి. టెక్నికల్ స్కిల్స్‌తో పాటు పర్సనల్ స్కిల్స్ కూడా ముఖ్యమే. రెజ్యూమెలో ట్రాకింగ్ సిస్టమ్‌లను పొందడానికి ఉద్యోగ వివరణలోని కీలక పదాలపై శ్రద్ధ వహించండి. ఏఐ ఇప్పుడు నియామకంలో సహాయం చేస్తోంది. చాట్‌జీపీటీ అందించిన విషయాలను కాపీ పేస్ట్ చేసుకున్న తరువాత మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకుని, మీ వివరాలను ఫిల్ చేసుకోవచ్చు. ఇలా ఒకదాని తరువాత ఒకటి పూర్తి చేస్తూ మీ రెజ్యూమ్ పూర్తి చేసుకోవచ్చు.

రెజ్యూమ్‌లో అన్నింటికంటే ముఖ్యంగా ప్రీవియస్ ఎక్స్‌పీరియెన్స్ అలాగే గతంలో మీరు సాధించిన విజయాలను ప్రస్తావించడం మర్చిపోకూడదు. ఎక్స్‌పీరియెన్స్, అచీవ్ మెంట్స్ అనేవి రిక్రూటర్లు అట్రాక్ట్ చేసే అంశాలు. అలాగే రెజ్యూమ్‌లో ఎలాంటి అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. అలాగే సరైన కమ్యూనికేషన్ కోసం అడ్రస్, ఫోన్‌ నంబర్, -మెయిల్‌ ఐడీలు కరెక్ట్‌గా ఇవ్వాలి. ఇక చివరిగా ఎలాగైనా జాబ్ సాధించాలనే ఉద్దేశంతో అవాస్తవాలు, అబద్దాలను రెజ్యూమెలో రాయకూడదు. డాక్యుమెంట్లు, రిఫరెన్సులు, ఎక్స్‌పీరియెన్స్, స్కిల్స్ విషయంలో నిజాయితీగా ఉండాలి. అప్పుడే చేయబోయే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.

మంచి రెజ్యూమ్‌ని తయారు చేయడం ప్రారంభం మాత్రమే. దీన్ని ఎల్లప్పుడూ అప్డేట్ గా ఉంచండి. మీకు ఉద్యోగాన్ని కనుగొనడంలో సహాయపడటానికి నెట్‌వర్కింగ్ మరియు లింక్డ్‌ఇన్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించండి. 2024లో మీరు మీ కెరీర్‌లో కొనసాగుతున్నప్పుడు మీరు ఎంత ప్రొఫెషనల్ మరియు నైపుణ్యంతో ఉన్నారో మీ రెజ్యూమ్‌ని చూపనివ్వండి.