KTR: నేడు కాంగ్రెస్.. రేపు కేఏ పాల్ అవ్వచ్చు..!
Telangana Elections: ప్రస్తుతానికైతే BRS పార్టీకి ప్రత్యర్ధి పార్టీగా కాంగ్రెస్ ఉందని.. వారం రోజుల తర్వాత కేఏ పాల్ (ka paul) ప్రత్యర్ధి అవ్వచ్చని సెటైర్ వేసారు KTR . ఎన్నికలకు ఇంకో వారం సమయం ఉన్న నేపథ్యంలో ఆయన వరుస ప్రచార కార్యక్రమాలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. ఈసారి తమ గెలుపు తథ్యం అని ప్రజలు కూడా ఒకే నేతను సీఎంగా ఉండాలని కోరుకుంటారు కానీ ప్రతి ఆరు నెలలకు ఒకరు సీఎం అవుతుంటే వారికి కూడా నచ్చదని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ అక్కడ సీఎం సీటు పంచుకునేందుకు కీచులాటలు మొదలైపోయానని తెలిపారు.
మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందని.. ప్రజలు కూడా కాంగ్రెస్‌ను స్కాంగ్రెస్‌గా చూస్తున్నారని ఆరోపించారు. ఈసారి ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ గెలిచాక KCRను అడిగి పర్యాటక శాఖ తీసుకోవాలని అనుకుంటున్నానని.. పర్యాటకంగా ఇంకా మెరుగుపరిచే ఐడియాలు తనకు ఉన్నాయని తెలిపారు.